
కోల్‌కతా: కపిల్ సిబల్ ఇటీవల పార్లమెంట్ హౌస్‌లో ఎంపీలు ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదంటూ జారీ చేసిన ఉత్తర్వులను ఖండిస్తూ...ఇది ఆమోదయోగ్యం కాదన్నారు . బీజేపీ పాలనలో దేశం సహకార సమాఖ్య విధానం నుంచి బలవంతపు ఏకపక్షవాదానికి మారిందని కాంగ్రెస్ మాజీ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు.
స్వతంత్ర రాజ్య సభ ఎంపీ కపిల్ సిబల్ దేశంలో సమాఖ్య నిర్మాణం తగ్గిపోయిందని, కేవలం అధికారమే కనిపిస్తోందన్నారు. అధికారం కోసం రాజ్యాంగాన్ని పాడు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, డిమాండ్లను తెలిపే ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చిందన్నారు. చర్చలు ప్రకక్రియ పూర్తిగా లేదని, తాము సహకార ఫెడరలిజం నుంచి బలవంతపు ఏకపక్షవాదానికి మారాం అని కపిల్ సిబల్ వ్యాఖ్యనించారు.
అంతేకాదు గవర్నర్ కార్యాలయాలు, కేంద్ర ఏజెన్సీలు దీర్ఘకాలిక ప్రభుత్వాలుగా మారాయి. పార్లమెంట్‌లో నిరసనలు నిషేధించడాన్ని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిరసనలు ఆపాలని అడిగే రోజు కూడా వస్తుందంటూ గట్టి కౌంటరిచ్చారు. రాజ్యసభ సెక్రటేరియట్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం..పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శనలు, ధర్నాలు, మతపరమైన వేడుకలు నిర్వహించరాదు. ఈ విషయమై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చాలా కాలంగా నోటీసులు జారీ చేస్తునే ఉన్నారు. దీంతో విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి.
(చదవండి: బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు!)