న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామాపై రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్ రాజీనామా నేపథ్యంలో ఎన్నికల కమిషన్(ఈసీ) నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా అని సిబల్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సిబల్ మీడియాతో మాట్లాడారు.
‘ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరపడం ఎన్నికల కమిషన్ విధి. అయితే గత పదేళ్లలో ఈసీ కేంద్ర ప్రభుత్వ మరో విభాగంలా తయారైంది’అని సిబల్ విమర్శించారు. దీనికి తోడు సిబల్ ఆదివారం ఎక్స్(ట్విటర్)లోనూ గోయెల్ రాజీనామాపై ఒక పోస్టు పెట్టారు. ‘దారి క్లియరైంది. కమిషన్ మొత్తం ఎస్ చెప్పే వ్యక్తులతో నింపండి.
అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థలకు ఇది వర్తిస్తుంది’ అని గోయెల్ రాజీనామాను ఉద్దేశించి సిబల్ సెటైర్లు వేశారు. కాగా, లోక్‌సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ కొద్దిరోజుల్లో వెలువడుతుందనగా ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామా సంచలనం రేపింది. ఈయన రాజీనామా దేశంలో రాజకీయ దుమారానికి దారి తీసింది.
ఇదీ చదవండి.. ఎన్నికల వేళ ఈడీ దూకుడు.. లాలూ సన్నిహితుడి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment