న్యూఢిల్లీ: గుజరాత్‌లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా రిటైర్డ్ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించినట్టు న్యాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
కాగా 1985 బ్యాచ్‌కు చెందిన(పంజాబ్ క్యాడర్) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్.. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్‌చంద్రపాడేతో కలిసి త్రిసభ్య కమిషన్‌లో చేరనున్నారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఈ ఏడాది మే 15న పదవీ విరమణ చేయడంతో ఆ బాధ్యతలు రాజీవ్‌కుమార్‌కు అప్పగించారు. పోల్ ప్యానెల్‌లో అప్పటి నుంచి ఇద్దరు సభ్యుల సంఘంగా ఉంది.
చదవండి: భారత ఆర్మీని పెళ్లికి ఆహ్వానించిన నవజంట.. సైన్యం రిప్లై ఇదే..
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్
Published Sat, Nov 19 2022 8:53 PM | Last Updated on Sat, Nov 19 2022 9:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment