
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ దేవాలయ సందర్శన వివాదాస్పదమైన క్రమంలో తాజాగా ప్రదాని నరేంద్ర మోదీ నిజమైన హిందువు కాదని సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. మోదీ అనుసరించేది హిందుత్వమని, హిందూయిజానికీ..హిందుత్వకూ వ్యత్యాసం ఉందని అన్నారు.మోదీ తరచూ దేవాలయాలకు వెళుతుంటారా అని ప్రశ్నించిన సిబల్ ఆయన నిజమైన హిందువు కాదని వ్యాఖ్యానించారు.
ప్రతి భారతీయుడిలో సోదరుడు, సోదరి, తల్లిని చూసేవాడే నిజమైన హిందువని అన్నారు. మరోవైపు బుధవారం రాహుల్ సోమ్‌నాథ్ ఆలయం సందర్శించిన సందర్భంగా రిజిస్టర్‌లో రాహుల్ పేరు రాయడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ రిజిస్టర్‌ను చూపుతూ రాహుల్ హిందువు కాదంటూ వ్యాఖ్యానించిన విషయం విదితమే. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్, మోదీ వరుస ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment