రూ. 50 వేల కోట్లకు స్పెక్ట్రం బిడ్డింగ్ | Bumper bids in 2G spectrum auction, but users may be losers | Sakshi
Sakshi News home page

రూ. 50 వేల కోట్లకు స్పెక్ట్రం బిడ్డింగ్

Published Thu, Feb 6 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM

రూ. 50 వేల కోట్లకు స్పెక్ట్రం బిడ్డింగ్

రూ. 50 వేల కోట్లకు స్పెక్ట్రం బిడ్డింగ్

 న్యూఢిల్లీ:  తాజా టెలికం స్పెక్ట్రం వేలానికి భారీ డిమాండ్ లభిస్తోంది. మూడో రోజున ఏకంగా రూ. 50,000 కోట్ల మేర బిడ్లు దాఖలయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం 21 రౌండ్లు పూర్తయ్యాయని టెలికం శాఖ కార్యదర్శి ఎంఎఫ్ ఫారుఖి తెలిపారు. మొత్తం మీద 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం కోసం రూ. 20,000 కోట్లు, 1800 మెగాహెట్జ్ కోసం రూ. 30,000 కోట్ల మేర బిడ్లు వచ్చాయని ఆయన వివరించారు.

దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి కనీసం రూ. 15,000 కోట్లయినా రాగలవని అంచనా వేస్తున్నట్లు ఫారుఖి చెప్పారు. కీలకమైన టెలికం స్పెక్ట్రం కోసం ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో ఇన్ఫో సహా 8 కంపెనీలు స్పెక్ట్రం కోసం పోటీపడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement