mobile bills
-
సెల్‌ఫోన్ బిల్లు నెలకు రూ.5వేలు.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
అగర్తల: లోక్‌సభ తొలి దశ ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న వేళ కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. త్రిపురలో బుధవారం(ఏప్రిల్17) జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు‘ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ లూట్ ఈస్ట్ పాలసీ అమలు చేసింది. మేం వచ్చి దానిని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చాం. కాంగ్రెస్ అధికారంలో ఉంటే త్రిపురలో సెల్‌ఫోన్ బిల్లు నెలకు ఒక్కొక్కరికి రూ.5వేల దాకా వచ్చేది. గతంలో ఇక్కడ మొబైల్ టవర్లు పనిచేసేవి కావు. ప్రస్తుతం మేమిక్కడ 5జీ కనెక్టివిటీ కోసం పనులు చేపట్టాం. మా ప్రభుత్వ చర్యల వల్ల ఇక్కడ మొబైల్ బిల్లు నెలకు రూ.500కు తగ్గింది. ఇదే కాంగ్రెస్ ఉంటే నెలకు రూ.5వేల రూపాయల బిల్లు వచ్చేది. ఈశాన్య రాష్ట్రాలను అవినీతికి హబ్‌గా కాంగ్రెస్ మార్చింది. త్రిపుర భవిష్యత్తును కమ్యూనిస్టులు పూర్తిగా పాడు చేశారు’అని మోదీ మండిపడ్డారు. ఇదీ చదవండి.. అణు బాంబుల ధ్వంసం.. సీపీఎంపై రాజ్‌నాథ్ ఫైర్ -
ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. ‘స్మార్ట్’ బిల్లు నెలకు 194 కోట్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నెలకు రూ.194 కోట్లు.. ఏడాదికి రూ. 2,328 కోట్లు.. మన రాష్ట్రంలో మొబైల్ ఫోన్ వినియోగదారులు చెల్లిస్తున్న బిల్లు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దైనందిన జీవితంలో విడదీయరానిదిగా మారిన మొబైల్ ఫోన్ల బిల్లులకు ఇంతమొత్తం వెచ్చిస్తున్నాం. సాక్షాత్తు టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) లెక్కలే ఇవి. రాష్ట్రంలో ఎంతమంది స్మార్ట్ ఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారోనని ట్రాయ్ లెక్కలు వేసింది. అక్టోబర్ 30 నాటికి 96,96,152 మొబైల్ (సాధారణ, స్మార్ట్) ఫోన్లు ఉన్నట్టు తేలింది. ఇవన్నీ మన రాష్ట్రంలోని చిరునామాలతో ఉన్న సిమ్కార్డులే. ఇతర రాష్ట్రాల్లో సిమ్‌కార్డులు తీసుకుని వినియోగిస్తున్నవారు కూడా పెద్దసంఖ్యలోనే ఉంటారు. మొత్తం మీద రాష్ట్రంలో 97 లక్షల మొబైల్ ఫోన్లు వాడకంలో ఉన్నాయని అంచనా. ఒక్కొక్కరు నెలకు రూ.200 వంతున వ్యయం చేస్తున్నారు. ఈ లెక్కన నెలకు రూ.194 కోట్ల బిల్లు కడుతున్నారు. సంవత్సరానికి రూ.2,328 కోట్లు చెల్లిస్తున్నారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. చాలామంది రూ.500 నుంచి రూ.వెయ్యికిపైగానే చెల్లించేవారున్నారు. 30 శాతం ఫోన్లు 25 ఏళ్లలోపు వారి దగ్గరే రాష్ట్రంలో ఉన్న మొబైల్ ఫోన్లలో 25 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు వారి చేతుల్లోనే 30 శాతం వరకు ఉన్నట్టు తేలింది. సగటున ఈ వయసు వాళ్లు రోజుకు 3 గంటలకుపైగా సెల్‌ఫోన్ వాడుతున్నారు. 30 ఏళ్లు, ఆపైన వయసు వారు 2 గంటల లెక్కన వాడుతున్నారు. యువకులు ఎక్కువగా టాక్ టైమ్ (మాట్లాడటం) కంటే సామాజిక మాధ్యమాలు అంటే వాట్సాప్, ఫేస్బుక్ తదితరాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. చాలామందికి సెల్‌ఫోన్ వినియోగం వ్యసనంగా మారినట్టు కూడా తేలింది. పనిగంటలకు తీవ్ర అంతరాయం కలగడమేగాక.. అనేకమంది విద్యార్థులు చదువుల్లో వెనకబడిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఏటా స్మార్ట్ఫోన్ల వినియోగదారుల సంఖ్య 10 నుంచి 15 శాతం పెరుగుతున్నట్టు తేలింది. -
మొబైల్ బిల్స్ పేమెంట్స్‌పై పేటీఎమ్ బంపర్ ఆఫర్...!
Paytm Offers Rewards: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ తన యూజర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్స్ పేమెంట్స్‌పై క్యాష్‌బ్యాక్‌ను, ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందించనుంది. ప్రతి బిల్లు చెల్లింపులో యూజర్లకు సుమారు రూ .500 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. అంతేకాకుండా ప్రతి బిల్ చెల్లింపుపై సుమారు 5వేల వరకు కచ్చితమైన క్యాష్‌బ్యాక్ పాయింట్లను కూడ పొందవచ్చును. ఈ క్యాష్‌బ్యాక్ పాయింట్లతో ప్రముఖ బ్రాండ్స్ డీల్స్, గిఫ్ట్ వోచర్లను పొందవచ్చును. చదవండి: వన్‌ప్లస్ 9 ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ప్రాసెసర్ జియో, బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వీఐ పోస్ట్‌పెయిడ్ సేవలకు సంబంధించిన అన్ని బిల్లు చెల్లింపులపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపుల కోసం రివార్డులను పొందడమే కాకుండా, కంపెనీ రిఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ద్వారా వినియోగదారులు అదనపు క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవచ్చు. యూజర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి పేటీఎం ఇటీవల మొబైల్ బిల్లు చెల్లింపులో భాగంగా త్రీ టైమ్-క్లిక్ తక్షణ చెల్లింపు ఫీచర్‌ను మరింత మెరుగుపరిచింది. యూజర్లు యూపీఐ, వ్యాలెట్, డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాకింగ్‌ను ఉపయోగించి చెల్లింపులను చేయవచ్చును. చదవండి: Work From Home: భవిష్యత్తులో ఉద్యోగులు ఇలా ఉంటారా! -
ఆటోమేటిక్ చెల్లింపులకు ఏప్రిల్ గండం..!
ముంబై: మొబైల్ బిల్లుల నుంచి కరెంటు, నీరు తదితర బిల్లుల దాకా ప్రతి నెలా జరపాల్సిన చెల్లింపుల కోసం ఆటోమేటిక్ విధానాన్ని పాటిస్తున్న కస్టమర్లు రాబోయే ఏప్రిల్‌లో సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిర్దేశించిన ప్రీ–డెబిట్ నోటిఫికేషన్ నిబంధనలు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండటం, బ్యాంకులు.. కార్డు సంస్థలు మాత్రం ఇంకా వీటిని పాటించేందుకు పూర్తిగా సన్నద్ధంగా లేకపోవడం ఇందుకు కారణం. దీని వల్ల నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ సర్వీసులకు, భారతి ఎయిర్టెల్.. వొడాఫోన్ వంటి టెల్కోలకు, టాటా పవర్ వంటి విద్యుత్ సంస్థలకు ఆటోమేటిక్ విధానంలో బిల్లులు కడుతున్న కస్టమర్లు ఇబ్బందులు పడనున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్చి 31 డెడ్‌లైన్.. సాధారణంగా ప్రతి నెలా జరపాల్సిన చెల్లింపుల కోసం పలువురు బ్యాంక్ కస్టమర్లు ఆటోమేటిక్ డెబిట్ విధానం ఎంచుకుంటూ ఉంటారు. దీని ప్రకారం నిర్దేశిత తేదీ నాడు బ్యాంకులు ఆయా బిల్లుకు కట్టాల్సిన మొత్తాలను వారి ఖాతాల నుంచి డెబిట్ చేస్తుంటాయి. సాధారణ ఖాతాదారులు, చిన్న..మధ్య తరహా సంస్థలు మొదలుకుని కార్పొరేట్ సంస్థల దాకా పలువురు కస్టమర్లు .. నెలవారీ బిల్లుల చెల్లింపులకు ఇలాంటి ఆటోమేటిక్ విధానాన్నే పాటిస్తున్నారు. ఏప్రిల్‌లో ఇలాంటి లావాదేవీల పరిమాణం సుమారు రూ. 2,000 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా. ఇంత కీలకంగా ఉన్న ఆటోమేటిక్ డెబిట్ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం... ఇకపై ఇలా పేమెంట్ జరిపే తేదీకి అయిదు రోజులు ముందే కస్టమరుకు బ్యాంకులు డెబిట్ లావాదేవీ గురించి నోటిఫికేషన్ పంపాల్సి ఉంటుంది. కస్టమరు అనుమతించిన తర్వాతే డెబిట్ చేయాల్సి ఉంటుంది. ఇక రూ. 5,000 దాటిన రికరింగ్ చెల్లింపుల కోసం ఖాతాదారుకు వన్–టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) కూడా పంపాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాలపై దృష్టి .. 2019 ఆగస్టులో ఆర్బీఐ ప్రతిపాదించిన ఈ నిబంధనలు ఏప్రిల్ 1తో మొదలయ్యే వచ్చే ఏడాది (2021–22) నుంచి అమల్లోకి వస్తున్నాయి. బ్యాంకులు, కార్డ్ నెట్‌వర్క్‌లు, ఆన్లైన్ విక్రేతలు తదితర వర్గాలు వీటిని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, పలు దిగ్గజ బ్యాంకులు, సంస్థలు ఈ నిబంధనలను పాటించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇంకా పూర్తి చేసుకోలేదని చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి ’స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్’ను అమలు చేయలేమంటూ కస్టమర్లకు బ్యాంకులు సమాచారం ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఎస్బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులతో పాటు ఎమెక్స్ వంటి కార్డ్ సంస్థలూ ఆటోమేటిక్ లావాదేవీలను తిరస్కరించే అవకాశం ఉం ది. ఈ నేపథ్యంలో డెబిట్/క్రెడిట్ కార్డులు మొదలైన వాటి ద్వారా ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరుగుతున్న సర్వీసులకు పేమెంట్ నిల్చిపోయి, సేవలకు విఘాతం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీంతో చెల్లింపులకు ప్రత్యామ్నాయ మార్గాలపై కస్టమర్లు దృష్టి పెట్టాల్సి రానుంది. వ్యక్తిగతంగా ఆయా సంస్థల వెబ్సైట్ల ద్వారా పేమెంట్స్ చేయాల్సి రావచ్చని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. -
భవిష్యత్తులో మొబైల్ బిల్లు తగ్గుతుందా?
సాక్షి, ముంబై: టెలికాం మార్కెట్లోకి జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత మొబైల్ ఫోన్ బిల్లుల బాదుడు గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా గత ఆరునెలల్లో సగటు నెలవారీ మొబైల్ బిల్లుల్లో 30నుంచి 40శాతం తగ్గిందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో కూడా ఇదే ధోరణి ఉంటుందే అనే దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రధానంగా మొబైల్ వినియోగదారులు ఆశించిన ధరల క్షీణతను పొందలేరని మార్కెట్‌వర్గాలు అంచనా వేశాయి. టెలికాం కంపెనీల ఆదాయ, మార్జిన్ల అధిక ఒత్తిళ్ల భారం వినియోగదారుడిపై పడనుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోదీంతో కస్టమర్లు డేటా, ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీలపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఎనలిస్టులు భావిస్తున్నారు. అంతేకాదు సంవత్సరానికి సుమారు 40శాతం వరకు పెరుగనుందట. భవిష్యత్‌లో ఫోన్ బిల్లులు మరింత తగ్గే అవకాశాలు కన్పించడం లేదని కౌంటర్‌పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసర్చ్ తెలిపింది. అయితే వివిధ ప్యాకేజీల మధ్య వ్యత్యాసం రూ. 100లకు బదులుగా 50రూపాయల కంటే తక్కువుంటే కస్టమర్లపై భారం ఫ్లాట్‌గానే అంచనా వేయవచ్చని కౌంటర పాయింట్ రీసెర్చ్ సత్యజిత్ సిన్హా వ్యాఖ్యానించారు. మరోవైపు సంవత్సరానికి సుమారు 40శాతం వరకు పెరుగుతాయని మరో అంచనా. అలాగే గత 9-10 నెలల్లో మొత్తం చందాదారులందరిలో నాలుగుశాతం ఎక్కువ ఆఫర్లను ప్యాకేజీలవైపు మళ్లారని , రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ నిష్పత్తి 50 శాతానికి పెరుగుతుందని మోతీలాల్ ఓస్వాల్ నివేదిక వెల్లడించింది. కాగా జియో ప్రవేశం తర్వాత ఎయిర్టెల్, ఐడియా సహా పలు టెలికాం సంస్థలు టారిఫ్‌లను తగ్గించడం సహా ఇతర ఆఫర్ల వల్ల టెలికాం సంస్థల ఆదాయానికి భారీగా గండిపడినట్లు తెలుస్తోంది. 2016 జూన్ నుంచి 2017 డిసెంబరు మధ్య టెలికాం కంపెనీలు దాదాపు 9.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయాయని ఇటీవల ఓ నివేదికలో తేలింది. ఈ కారణాల వల్ల భవిష్యత్‌లో టారిఫ్‌లను తగ్గించకూడదని టెలికాం సంస్థలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కస్టమర్ల సౌలభ్యం కోసం ఉన్న టారిఫ్‌లలోనే ఎక్కువ డేటా, మరిన్ని ఉచిత సదుపాయాలను అందించే అవకాశాలున్నాయని సమాచారం. -
మోత మోగనున్న మొబైల్ బిల్లులు!
కోల్కత్తా : నాలుగంచెల ఏకీకృత పన్ను విధాన నిర్మాణం ఎట్టేకేలకు విడుదలైంది. ఈ నేపథ్యంలో వేటిపై ఎంత భారం పడనుందని కంపెనీలు అంచనావేసుకుంటున్నాయి. జీఎస్టీ విధానం అమల్లోకి వస్తే వినియోగదారుల మొబైల్ బిల్స్ ఎక్కువగా పెరగనున్నాయని తెలుస్తోంది. మొబైల్ కంపెనీలు వారు అందించే సర్వీసులపై పన్ను రేటు పెరగనుందని, దీనికి అనుగుణంగా కంపెనీలు మొబైల్ బిల్లులపై మోత మోగించనున్నాయని సమాచారం. టెలికాం పరిశ్రమ ప్రస్తుతం 15 శాతం పన్నుల పరిధిలోకి వస్తోంది. అయితే గురువారం జీఎస్టీ మండలి ఆమోదించిన నాలుగంచెల జీఎస్టీ విధానం రేట్లు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్నాయి. టెలికాం పరిశ్రమను 12 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తే, ప్రభుత్వ రెవెన్యూలకు గండికొట్టనుందని, దీంతో ఈ పరిశ్రమను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్‌లు అంటున్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్ మేయింటెన్స్ యాక్ట్, 1968 నేతృత్వంలో టెలికాంలు ముఖ్యమైన సర్వీసులుగా పరిగణించబడుతున్నాయని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(కోయ్) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమైన ఉత్పత్తులు, సేవల కిందకు టెలికాం పరిశ్రమ పన్ను రేట్లను తీసుకురావాలని, 15శాతానికి తక్కువగా పన్ను విధించాలని ఆయన కోరారు. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో సభ్యులుగా ఉన్నాయి. టెలికాం పరిశ్రమపై విధించే ఎక్కువ పన్ను రేట్లతో వినియోగదారుల నెలవారీ సెల్‌ఫోన్ బిల్స్ కూడా 3 శాతం మేర పెరుగనున్నాయని కంపెనీలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వినియోగదారులు చెల్లిస్తున్న నెలవారీ బిల్లు రూ.1000కు అదనంగా రూ.30ల కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నాయి.. అదేవిధంగా పెట్రో ప్రొడక్ట్‌లపై విధించే పన్ను రేట్లు కూడా టెలికాం కంపెనీలపై ప్రభావం చూపనున్నాయని మాథ్యూస్ చెప్పారు. రైల్వే తర్వాత డీజిల్‌కు రెండో అతిపెద్ద వినియోగదారిగా టెలికాం రంగం ఉందని పేర్కొన్నారు. -
రూ. 50 వేల కోట్లకు స్పెక్ట్రం బిడ్డింగ్
న్యూఢిల్లీ: తాజా టెలికం స్పెక్ట్రం వేలానికి భారీ డిమాండ్ లభిస్తోంది. మూడో రోజున ఏకంగా రూ. 50,000 కోట్ల మేర బిడ్లు దాఖలయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం 21 రౌండ్లు పూర్తయ్యాయని టెలికం శాఖ కార్యదర్శి ఎంఎఫ్ ఫారుఖి తెలిపారు. మొత్తం మీద 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం కోసం రూ. 20,000 కోట్లు, 1800 మెగాహెట్జ్ కోసం రూ. 30,000 కోట్ల మేర బిడ్లు వచ్చాయని ఆయన వివరించారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి కనీసం రూ. 15,000 కోట్లయినా రాగలవని అంచనా వేస్తున్నట్లు ఫారుఖి చెప్పారు. కీలకమైన టెలికం స్పెక్ట్రం కోసం ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో ఇన్ఫో సహా 8 కంపెనీలు స్పెక్ట్రం కోసం పోటీపడుతున్న సంగతి తెలిసిందే.