మోత మోగనున్న మొబైల్ బిల్లులు! | Your mobile bills may go up once GST is in place | Sakshi
Sakshi News home page

మోత మోగనున్న మొబైల్ బిల్లులు!

Nov 5 2016 4:28 PM | Updated on Sep 4 2017 7:17 PM

మోత మోగనున్న మొబైల్ బిల్లులు!

మోత మోగనున్న మొబైల్ బిల్లులు!

జీఎస్టీ విధానం అమల్లోకి వస్తే వినియోగదారుల మొబైల్ బిల్స్ ఎక్కువగా పెరగనున్నాయని టెలికాం పరిశ్రమ చెబుతోంది.

కోల్కత్తా : నాలుగంచెల ఏకీకృత పన్ను విధాన నిర్మాణం ఎట్టేకేలకు విడుదలైంది. ఈ నేపథ్యంలో వేటిపై ఎంత భారం పడనుందని కంపెనీలు అంచనావేసుకుంటున్నాయి. జీఎస్టీ విధానం అమల్లోకి వస్తే వినియోగదారుల మొబైల్ బిల్స్ ఎక్కువగా పెరగనున్నాయని తెలుస్తోంది. మొబైల్ కంపెనీలు వారు అందించే సర్వీసులపై పన్ను రేటు పెరగనుందని, దీనికి అనుగుణంగా కంపెనీలు మొబైల్ బిల్లులపై మోత మోగించనున్నాయని సమాచారం.
 
టెలికాం పరిశ్రమ ప్రస్తుతం 15 శాతం పన్నుల పరిధిలోకి వస్తోంది. అయితే గురువారం జీఎస్టీ మండలి ఆమోదించిన నాలుగంచెల జీఎస్టీ విధానం రేట్లు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్నాయి. టెలికాం పరిశ్రమను 12 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తే, ప్రభుత్వ రెవెన్యూలకు గండికొట్టనుందని, దీంతో ఈ పరిశ్రమను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్లు అంటున్నారు.
 
ఎసెన్షియల్ సర్వీసెస్ మేయింటెన్స్ యాక్ట్, 1968 నేతృత్వంలో టెలికాంలు ముఖ్యమైన సర్వీసులుగా పరిగణించబడుతున్నాయని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(కోయ్) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమైన ఉత్పత్తులు, సేవల కిందకు టెలికాం పరిశ్రమ పన్ను రేట్లను తీసుకురావాలని, 15శాతానికి తక్కువగా పన్ను విధించాలని ఆయన కోరారు. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లో సభ్యులుగా ఉన్నాయి. టెలికాం పరిశ్రమపై విధించే ఎక్కువ పన్ను రేట్లతో వినియోగదారుల నెలవారీ సెల్ఫోన్ బిల్స్ కూడా 3 శాతం మేర పెరుగనున్నాయని కంపెనీలు పేర్కొంటున్నాయి.
 
ప్రస్తుతం వినియోగదారులు చెల్లిస్తున్న నెలవారీ బిల్లు రూ.1000కు అదనంగా రూ.30ల కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నాయి.. అదేవిధంగా పెట్రో ప్రొడక్ట్లపై విధించే పన్ను రేట్లు కూడా టెలికాం కంపెనీలపై ప్రభావం చూపనున్నాయని మాథ్యూస్ చెప్పారు. రైల్వే తర్వాత డీజిల్కు రెండో అతిపెద్ద వినియోగదారిగా టెలికాం రంగం ఉందని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement