అగర్తల: లోక్‌సభ తొలి దశ ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న వేళ కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. త్రిపురలో బుధవారం(ఏప్రిల్17) జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు‘ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ లూట్ ఈస్ట్ పాలసీ అమలు చేసింది.
మేం వచ్చి దానిని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చాం. కాంగ్రెస్ అధికారంలో ఉంటే త్రిపురలో సెల్‌ఫోన్ బిల్లు నెలకు ఒక్కొక్కరికి రూ.5వేల దాకా వచ్చేది. గతంలో ఇక్కడ మొబైల్ టవర్లు పనిచేసేవి కావు. ప్రస్తుతం మేమిక్కడ 5జీ కనెక్టివిటీ కోసం పనులు చేపట్టాం.
మా ప్రభుత్వ చర్యల వల్ల ఇక్కడ మొబైల్ బిల్లు నెలకు రూ.500కు తగ్గింది. ఇదే కాంగ్రెస్ ఉంటే నెలకు రూ.5వేల రూపాయల బిల్లు వచ్చేది. ఈశాన్య రాష్ట్రాలను అవినీతికి హబ్‌గా కాంగ్రెస్ మార్చింది. త్రిపుర భవిష్యత్తును కమ్యూనిస్టులు పూర్తిగా పాడు చేశారు’అని మోదీ మండిపడ్డారు.
ఇదీ చదవండి.. అణు బాంబుల ధ్వంసం.. సీపీఎంపై రాజ్‌నాథ్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment