north east
-
సెల్‌ఫోన్ బిల్లు నెలకు రూ.5వేలు.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
అగర్తల: లోక్‌సభ తొలి దశ ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న వేళ కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. త్రిపురలో బుధవారం(ఏప్రిల్17) జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు‘ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ లూట్ ఈస్ట్ పాలసీ అమలు చేసింది. మేం వచ్చి దానిని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చాం. కాంగ్రెస్ అధికారంలో ఉంటే త్రిపురలో సెల్‌ఫోన్ బిల్లు నెలకు ఒక్కొక్కరికి రూ.5వేల దాకా వచ్చేది. గతంలో ఇక్కడ మొబైల్ టవర్లు పనిచేసేవి కావు. ప్రస్తుతం మేమిక్కడ 5జీ కనెక్టివిటీ కోసం పనులు చేపట్టాం. మా ప్రభుత్వ చర్యల వల్ల ఇక్కడ మొబైల్ బిల్లు నెలకు రూ.500కు తగ్గింది. ఇదే కాంగ్రెస్ ఉంటే నెలకు రూ.5వేల రూపాయల బిల్లు వచ్చేది. ఈశాన్య రాష్ట్రాలను అవినీతికి హబ్‌గా కాంగ్రెస్ మార్చింది. త్రిపుర భవిష్యత్తును కమ్యూనిస్టులు పూర్తిగా పాడు చేశారు’అని మోదీ మండిపడ్డారు. ఇదీ చదవండి.. అణు బాంబుల ధ్వంసం.. సీపీఎంపై రాజ్‌నాథ్ ఫైర్ -
కళ్లు చెదిరే అందంతో రంగులీనుతుంది ఆ ఎడారి..అడుగుపెట్టారో అంతే..!
ఇదో ప్రకృతి కళాఖండం. ఉత్తర ఆఫ్రికాలో ఇథియోపియా ఈశాన్య ప్రాంతంలోని దీన్ని దానకిల్ డిప్రెషన్ అంటారు. 1,36,956 చదరపు కిలోమీటర్ల మేర కళ్లు చెదిరేంత అందంతో రంగులీనుతుంది ఈ ప్రదేశం. ఇక్కడ అడుగు పెడితే వేరే గ్రహం మీద అడుగుపెట్టినట్లుంటుంది. ప్రపంచంలోని అత్యంత వేడి ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ భూమి నుంచి నిత్యం నిప్పులు ఎగసిపడతాయి. ఇక్కడ నీళ్లు కుతకుతా మరుగుతాయి. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఆమ్లవర్షం కురుస్తుంటుంది. మనిషి మనుగడకు అనుకూలం కాని ఈ ఎడారిలో చూడతగ్గ అందాలెన్నో ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రమాదాలు కూడా నీడలా పొంచే ఉంటాయి. భూమి లోపల అల్లకల్లోలం ఏర్పడినప్పుడల్లా నిప్పులుచిమ్మే లావా ఎగసిపడుతుంది. అది ధారలా పొంగి, కనుచూపు మేర రంగురంగుల కథలెన్నో చెబుతుంది. లక్షల సంవత్సరాలుగా ఈ భూభాగం ఎన్నో మార్పులకు గురైంది. దీనిలోని వైవిధ్యభరితమైన మార్పులను గుర్తించి, దీనికి ‘దానకిల్ డిప్రెషన్’ అని పేరు పెట్టారు. దానకిల్ చుట్టుపక్కల పెద్దపెద్ద లోయలు, ఎతై న పర్వతాలు, ఉప్పు గోపురాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ఇక్కడికి వెళ్లే పర్యాటకులంతా స్థానిక గైడ్ అడుగుజాడల్లోనే నడుచుకోవాలని సూచిస్తుంటారు. సురక్షితమైన పాదరక్షలు ధరించి మాత్రమే నడవాలంటారు. చేతులతో ఏదిపడితే అది తాకి చూడటం ప్రమాదమని హెచ్చరిస్తారు. గ్రహాంతర ప్రదేశంలా ఉండే ఈ దానకిల్లో వేడి నీటి బుగ్గలు, ఆమ్ల కొలనులు, సరస్సులు మైమరిపిస్తుంటాయి. అయితే ఈ ఎడారి ఎందుకు ఇంత వేడిగా ఉంటుంది? భూమి లోపల ఏం జరుగుతూ ఉంటుంది? లాంటి వివరాలను శాస్త్రవేత్తలు సైతం కనిపెట్టలేకపోయారు. దాంతో భూమి మీద ఈ ప్రదేశం మిస్టీరియస్‌గానే మిగిలిపోయింది. ఇథియోపియాలో కొన్ని శతాబ్దాల క్రితం ఉప్పును కూడా కరెన్సీగా ఉపయోగించేవారట. అందుకోసం ఉప్పును సేకరించేందుకు ఈ ప్రదేశానికి వెళ్లేవారట. ఒకప్పుడు ఈ ప్రాంతం ఎర్ర సముద్రంలో భాగంగా ఉండేది. కాలక్రమేణా అగ్నిపర్వతాల విస్ఫోటాల కారణంగా.. కొంతభాగం సల్ఫ్యూరిక్ సరస్సులా మారింది. మరికొంత భాగం లావాతో బీటలువారి ఎడారిని తలపిస్తుంది. శిలాద్రవంలోని ఖనిజాలు, సముద్రపు ఉప్పు నీరు, ఆమ్ల వర్షపు నీరు కలసి పసుపు, నారింజ, ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులతో ఈ ప్రాంతమంతా మెరుస్తుంది. ఇక్కడ కొంత సురక్షితమైన భూభూగానికి పర్యాటకులు తరచుగా వెళుతుంటారు. చూడటానికి ఈ పరిసర ప్రాంతాలన్నీ చాలా వింతగా ఉంటాయి. ఒక చోట వేడి నీరు.. పొగలు కక్కుతుంటే, పక్కనే మరో చోట చల్లటి నీటి కొలను సేదతీరుస్తుంది. మనుషులను మునిగిపోనివ్వకుండా తేలియాడిస్తూ ఆటలాడిస్తుంది. --సంహిత నిమ్మన (చదవండి: కాదేది రికార్డుకనర్హం! అగ్గిపుల్లలతో సరికొత్త రికార్డు..!) -
ఐటీ సర్వ్ అలయెన్స్ ఉదారత.. టాస్క్‌కి రూ. 80 వేలు విరాళం!
అమెరికాలోని ఐటీ సర్వ్ అలయెన్స్ (ఐటీ సర్వీస్ అలియన్స్) నార్త్ ఈస్ట్ చాప్టర్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. న్యూజెర్సీలో సీఎస్ఆర్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా థాంక్స్ గివింగ్ చేపట్టింది. నార్త్ ఈస్ట్ చాప్టర్ అధ్యక్షుడు కళ్యాణ్ విజయ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ ఫుడ్ బ్యాంక్ అయిన ట్రెంటన్ ఏరియా సూప్ కిచెన్ (టాస్క్) కి 1,000 డాలర్ల విరాళం అందజేశారు. ఈ మేరకు ఐటీ సర్క్ సభ్యులు టాస్క్ నిర్వహకులకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫుడ్ బ్యాంక్‌ను ఐటీ సర్వ్ సభ్యులు సందర్శించారు. టాస్క్ చేస్తున్నసేవా కార్యక్రమాలతో పాటు ఆహారం తయారు చేసే విధానాన్ని ఐటీ సర్వ్ సభ్యులకు నిర్వహకులు వివరించారు. ట్రెంటన్ నగరంలో ఆకలితో మరియు కష్టాల్లో ఉన్న వారి అవసరాలను తీర్చే ఒక అద్భుతమైన సంస్థ టాస్క్ అని ఈ సందర్భంగా కళ్యాణ్ విజయ్ పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగమైనందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఐటీ సర్క్ అలయన్స్ తరుపున సహాయం చేసే అవకాశం వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఐటీ సర్వ్ అలయన్స్ ఉదారతను టాస్క్ ప్రశంసించింది. ఈ ఆర్థిక సాయం ఎంతో మందికి ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. సంస్థ చేస్తున్న సేవాకార్యక్రమాల్లో భాగమై ఆర్థిక సహాయసహాకారాలు అందించినందుకు ఐటీ సర్వ్ అలయన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఐటీ సర్వ్ అలయెన్స్ అనేది ఐటీ రంగానికి చెందిన 1400 కంపెనీలతో ఏర్పడిన ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అమెరికాలోని 22 రాష్ట్రాలలో ఉన్న 19 చాప్టర్లలో ఈ సంస్థ ఐటీ సేవలను అందిస్తోంది. ఈ సంస్థలో ఉన్న ఐటీ కంపెనీల మొత్తం ఆదాయం 10 బిలియన్ డాలర్లు. లక్ష మంది ఐటీ నిపుణులు ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ప్రారంభం) -
పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు.. ఐదుగురి మృతి!
బక్సర్: నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు బిహార్‌లోని బక్సర్ జిల్లా రఘునాథ్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ రైలు ఢిల్లీ నుంచి అస్సాంకు బయలుదేరింది. బుధవారం రాత్రి 9.35 గంటలకు కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రైలు కోచ్‌లు పట్టాలు తప్పడం వెనుక కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ అధికారం ఉందా?.. జమ్ము విభజనపై సుప్రీం
ఢిల్లీ: ఉగ్రవాదం, వేర్పాటువాదం లాంటివి కేవలం జమ్ము కశ్మీర్‌కే పరిమితం కాలేదు. పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు సహా చాలా రాష్ట్రాలు ఆ తరహా పీడిత రాష్ట్రాలేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై విచారణ సందర్భంగా.. జమ్ము కశ్మీర్ విభజనపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. ‘‘జమ్ము కశ్మీర్‌ను 2019లో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లే.. ఇరత రాష్ట్రాలనూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించే అధికారం పార్లమెంట్‌కు, కేంద్రానికి ఉంటుందా?’’ అని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి కేంద్రం తరపున వాదనలు వినిపించిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇవ్వగా.. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జోక్యం చేసుకున్నారు. జమ్ము కశ్మీర్‌లోనే కాదు.. పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ జమ్ము తరహా పరిస్థితులు చూస్తున్నాం కదా అని అన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ గవాయి సైతం మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్లను ప్రశ్నించారు. కేవలం సరిహద్దు రాష్ట్రం గనుకే ప్రత్యేకంగా భావించాం గనుకే విభజించాం అనే సమాధానం ఇవ్వకండి అంటూ జస్టిస్ కౌల్ అసహనం ప్రదర్శించారాయన. అయితే.. దశాబ్దాల కాలం నుంచి జమ్ము ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటోందని. పైగా పీవోకేతో సరిహద్దు పంచుకుంటోందని, జమ్ము విషయంలో కేంద్రం తొందరపాటు ప్రదర్శించలేదు. విధానాల పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకుందని. ఒకవేళ గుజరాతో, మధ్యప్రదేశ్‌లను విభజించాల్సి వస్తే.. అప్పుడు ప్రామాణికాలు వేరుగా ఉంటాయని సాలిసిటర్ జనరల్ బెంచ్‌కు వివరించారు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కలగజేసుకుని.. ‘‘ఒక రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అంగీకరించిన తర్వాత.. ఆ అధికార దుర్వినియోగం చేయకుండా ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కేంద్రానికో.. లేదంటే పార్లమెంట్‌కో.. ఇప్పుడున్న ప్రతీ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగానో.. విభజన చేయగల అధికారమో ఉందా? అని ప్రశ్నించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 విషయంలో రాజ్యాంగ పరిషత్(పార్లమెంట్) పాత్ర కేవలం సిఫార్సు పాత్రను కలిగి ఉంటుంది. అలాగని అది రాష్ట్రపతి అధికారాలను భర్తీ చేసేదిగా ఉండకూడదు అని రాజ్యంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక.. జమ్ము కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోరగా.. సెప్టెంబర్ 1వ తేదీన ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని కేంద్రం, కోర్టుకు తెలియజేసింది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం అప్పట్లో పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంతం అనేది శాశ్వతం కాదు -
నిశాంత్, హర్షిత్ సెంచరీలు.. ప్రత్యర్థి జట్టుకు తప్పని తిప్పలు
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్ జట్టుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 306/6 రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 8 వికెట్లకు 540 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. నిశాంత్ సింధు (245 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు), హర్షిత్ రాణా (86 బంతుల్లో 122 నాటౌట్; 12 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. నిశాంత్‌తో కలిసి హర్షిత్ ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు... సిద్ధార్థ్ కౌల్ (9 నాటౌట్)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ ఈస్ట్ జోన్ జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. సెంట్రల్ జోన్‌కు ఆధిక్యం ఈస్ట్ జోన్ జట్టుతో జరగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో సెంట్రల్ జోన్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓవరాల్‌గా 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు జవాబుగా ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 42.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. సెంట్రల్ జోన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, సౌరభ్ కుమార్ మూడు వికెట్ల చొప్పున తీశారు. 60 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన సెంట్రల్ జోన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు సాధించింది. -
ఐఎస్ఎల్లో హైదరాబాద్ ఎఫ్సీకి తొలి విజయం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఎఫ్‌సీ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీతో జరిగిన పోరులో హైదరాబాద్ 3–0తో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జోరు ముందు నార్త్ఈస్ట్ జట్టు తేలిపోయింది. మ్యాచ్ ఆరంభమైన 13వ నిమిషంలోనే బార్తొలొమి ఒబెచ్ గోల్ చేయడంతో 1–0తో హైదరాబాద్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై క్రమం తప్పకుండా దాడులకు పదునుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ రెండో అర్ధభాగంలో మరో రెండు గోల్స్ చేసింది. హలిచరన్ నర్జరీ (69వ ని.), బొర్జ హెరెరా (73వ ని.) నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేయడంతో హైదరాబాద్ విజయం ఖాయమైంది. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌ను 3–3తో డ్రా చేసుకున్న హైదరాబాద్ జట్టు ప్రదర్శన ఈ మ్యాచ్‌లో మరింత మెరుగైంది. -
దుమ్మురేపిన జైస్వాల్.. తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ!
దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లోనే ముంబై యువ ఆటగాడు, వెస్ట్ జోన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతోన్న తొలి క్వార్టర్ ఫైనల్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 321 బంతులు ఎదర్కొన్న జైస్వాల్.. 18 ఫోర్లు, 6 సిక్సర్లతో 228 పరుగులు సాధించాడు. జైస్వాల్‌ను అభినందిస్తూ.. రాజస్తాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు జైస్వాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో అతడితో పాటు టీమిండియా వెటరన్ ఆటగాడు, వెస్ట్ జోన్ కెప్టెన్ ఆజింక్యా రహానే కూడా ద్విశతకం సాధించాడు. 228 on his #DuleepTrophy debut. 👌💗 Jaiswal was bemisaal. 💥 pic.twitter.com/4wzmtJ0VP5 — Rajasthan Royals (@rajasthanroyals) September 9, 2022 ఈ మ్యాచ్‌లో 207 పరుగులు చేసి రహానే ఆజేయంగా నిలిచాడు. మరో వైపు ఓపెనర్ పృథ్వీ షా(113) సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్ జోన్ రెండు వికెట్లు కోల్పోయి 590 పరుగుల భారీ స్కోర్ సాధించింది. https://t.co/OQ75iKb2f4 — Rockstar MK 🇮🇳 (@RockstarMK11) September 9, 2022 చదవండి: Duleep Trophy 2022: డబుల్ సెంచరీతో చెలరేగిన అజింక్య రహానే... -
మళ్లీ రగులుకున్న ‘ఈశాన్యం’
సాక్షి, న్యూఢిల్లీ : అస్సాం, త్రిపుర, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ అగ్గి రాజుకుంది. ఏడాది క్రితం డిసెంబర్ 11, 2019లో పార్లమెంట్ ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఢిల్లీలో ఆందోళనలు అల్లర్లకు కూడా దారితీయడంతో పలువురు అమాయకులు మరణించారు. ముస్లింలను వేరుచేసి దేశ బహిష్కారం చేయడం కోసం ఈ బిల్లును తెచ్చారంటూ ఎక్కువ రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగగా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇస్తుందన్న కారణంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈలోగా ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో పౌరసత్వ గొడవలు సద్దు మణిగాయి.(భారత్ బంద్‌లో వీరేరి?) ఇప్పుడు మళ్లీ ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. భారత్ వలస దేశంగా ఉన్నప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాలు అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో స్వాతంత్రం వచ్చేనాటికి అక్కడి జనాభాలో 30 శాతం మంది వలస వచ్చిన వారు కాగా, ఇప్పుడు వారి సంఖ్య 80 శాతానికి చేరుకుంది. అస్సాం పలు ప్రాంతాల్లోకి బెంగాలీ మాట్లాడే వారి వలసలు ఎక్కువగా వచ్చాయి. 19, 20 శతాబ్దాల్లో వారి వలసలు ఎక్కువగా కొనసాగాయి. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు అస్సాంలోకి వలసలు ఎక్కువగా కొనసాగాయి. ఈ వలసలకు వ్యతిరేకంగా 1979 నుంచి ఆరేళ్లపాటు ఆందోళనలు తీవ్రంగా కొనసాగాయి. 1985లో అస్సాం జాతీయవాదులు కేంద్రంతో ఒప్పందం చేసుకోవడంతో ఆందోళనలు ఆగిపోయాయి.ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుతో బెంగాలీలు, అస్సామీలు, ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ మధ్య మళ్లీ చిచ్చు రగిల్చాయి. ప్రధానంగా అస్సాంలో ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్’ వల్ల ఆందోళనలు ఎక్కువగా జరగుతున్నాయి. దీనివల్ల దాదాపు 20 లక్షల మంది భారతీయ పౌరులు కాకుండా పోయారు. దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్రానికి అక్రమ వలసలు పెరగుతాయని కూడా అస్సామీలు భయాందోళనలకు గురవుతున్నారు. అస్సాం, మిజోరమ్ మధ్య ఈ ఆందోళనతోపాటు ఇటీవల సరిహద్దు వివాదంతో ఘర్షణలు చెలరేగిన విషయం తెల్సిందే. త్రిపుర, మేఘాలయలలో కూడా ఆందోళనలు చెలరేగాయి. -
రెండ్రోజుల ముందే పండుగ..
-
రెండ్రోజుల ముందే పండుగ..
- కేరళ, ఈశాన్య భారతాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు - సాధారణం కంటే రెండు రోజుల ముందే రాక న్యూఢిల్లీ: భారత వ్యవసాయరంగానికి ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందే దేశంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాయి. అండమాన్ దీవుల మీదుగా ప్రయాణించిన రుతుపవనాలు మంగళవారం ఉదయం ఇటు దక్షిణ కేరళ, అటు ఈశాన్య భారతంలోకి ప్రవేశించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడి, వర్షాలు మొదలయ్యాయి. సాధారణంగా జూన్1న నైరుతి రుతుపవనాలు కేరళలను తాకుతాయి. అందుకు భిన్నంగా ఈ సారి రెండురోజుల ముందే ఆగమనం చేశాయి. జూన్ మొదటివారంలో తెలంగాణ, ఏపీలకు మంగళవారం భారత్‌లోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తూ జూన్ మొదటివారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను తాకనున్నాయి. దీంతో రైతులు వ్యవసాయపనులను వేగవంతం చేశారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నార్త్ ఈస్ట్‌పై ముంబై విజయం
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం ముంబైలోనే నార్త్ ఈస్ట్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో విజయం సాధించింది. ముంబైకి 55వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను ఫోర్లాన్ గోల్‌గా మలిచాడు. మ్యాచ్ మొత్తం నార్త్ ఈస్ట్ అనేక అవకాశాలు సృష్టించుకున్నా... వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. సీజన్లో మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన నార్త్ ఈస్ట్‌కు ఇది తొలి ఓటమి. -
చెత్రి ‘హ్యాట్రిక్’నార్త్ ఈస్ట్‌పై ముంబై గెలుపు
ముంబై: భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో చెలరేగడంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ముంబై సిటీ ఎఫ్‌సీ సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 5-1తో నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీని చిత్తు చేసింది. ముంబై తరఫున చెత్రి (25, 40, 48వ. ని.), నోర్డి (51వ ని.), బెర్టిన్ (87వ ని.) గోల్స్ చేయగా... బోతాంగ్ (29వ ని.) నార్త్ ఈస్ట్‌కు ఏకైక గోల్ అందించాడు. ఈ సీజన్లో ఇది రెండో హ్యాట్రిక్. చెన్నైయిన్‌కు చెందిన స్టీవెన్ మెండోజా... గోవాపై తొలి హ్యాట్రిక్ సాధించాడు. 10 పాయింట్లతో ముంబై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. గురువారం జరిగే మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతా.. ఢిల్లీ డైనమోస్‌తో తలపడుతుంది. -
ఈశాన్య భారతంలో రెండో విడత పోలింగ్
ఈశాన్య భారతంలోని నాలుగు రాష్ట్రాల్లోని ఆరు ఎంపీ నియోకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ రోజు పోలింగ్ లో ఓటర్లు చురుకుగా పాల్గొంటున్నారు. అరుణాచల్, మేఘాలయల్లో చెరి రెండు, నాగాలండ్, మణిపూర్ లలో చెరొక సీటు ఉన్నాయి. దీనితో పాటు అరుణాచల్ ప్రదేశ్ లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 49 సీట్లకు గాను పోలింగ్ జరుగుతోంది. మిజోరామ్ లోనూ పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ అక్కడ బ్రు తెగ ఓటర్లకు ఓటు వేసే సదుపాయాన్ని కల్పించినందుకు నిరసనగా రాష్ట్ర బంద్ జరిగింది. దీనితో అక్కడ ఎన్నికలు ఏప్రిల్ 11 న జరుగుతాయి. నాగాలాండ్ లోని ఒకే ఒక్క ఎంపీ సీటు కోసం తొలి మూడు గంటల్లోనే 20.9 శాతం ఓట్లు పడ్డాయి. నాగాలాండ్ లో 2059 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ లలోనూ పోలింగ్ చురుకుగా సాగుతోంది. ప్రధానంగా గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే మణిపూర్ ఔటర్ లోకసభ నియోజకవర్గంలోనూ పోలింగ్ సాగుతోంది. ఇక్కడ పోటీలో పదిమంది అభ్యర్థులున్నారు. మేఘాలయలో ని తురా నియోజకవర్గం నుంచి మాజీ లోకసభ స్పీకర్ పి.ఎ. సాంగ్మా కూడా పోటీలో ఉన్నారు. ఇక్కడ పదిహేను లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకున్నారు.