భారత వ్యవసాయరంగానికి ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందే దేశంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాయి. అండమాన్ దీవుల మీదుగా ప్రయాణించిన రుతుపవనాలు మంగళవారం ఉదయం ఇటు దక్షిణ కేరళ, అటు ఈశాన్య భారతంలోకి ప్రవేశించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడి, వర్షాలు మొదలయ్యాయి.