Thousands
-
కడసారి వీడ్కోలు.. రతన్ టాటా అంతిమ యాత్ర (ఫోటోలు)
-
సెల్‌ఫోన్ బిల్లు నెలకు రూ.5వేలు.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
అగర్తల: లోక్‌సభ తొలి దశ ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న వేళ కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. త్రిపురలో బుధవారం(ఏప్రిల్17) జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు‘ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ లూట్ ఈస్ట్ పాలసీ అమలు చేసింది. మేం వచ్చి దానిని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చాం. కాంగ్రెస్ అధికారంలో ఉంటే త్రిపురలో సెల్‌ఫోన్ బిల్లు నెలకు ఒక్కొక్కరికి రూ.5వేల దాకా వచ్చేది. గతంలో ఇక్కడ మొబైల్ టవర్లు పనిచేసేవి కావు. ప్రస్తుతం మేమిక్కడ 5జీ కనెక్టివిటీ కోసం పనులు చేపట్టాం. మా ప్రభుత్వ చర్యల వల్ల ఇక్కడ మొబైల్ బిల్లు నెలకు రూ.500కు తగ్గింది. ఇదే కాంగ్రెస్ ఉంటే నెలకు రూ.5వేల రూపాయల బిల్లు వచ్చేది. ఈశాన్య రాష్ట్రాలను అవినీతికి హబ్‌గా కాంగ్రెస్ మార్చింది. త్రిపుర భవిష్యత్తును కమ్యూనిస్టులు పూర్తిగా పాడు చేశారు’అని మోదీ మండిపడ్డారు. ఇదీ చదవండి.. అణు బాంబుల ధ్వంసం.. సీపీఎంపై రాజ్‌నాథ్ ఫైర్ -
గూగుల్ పే 88 వేల క్యాష్ బ్యాక్...
-
ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్ కూడా..వేలాదిమందికి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితుల ఆందోళన నేపథ్యంలో ఉద్యోగుల మెడపై ఉద్వాసనల కత్తి వేలాడుతోంది. తాజాగా చిప్‌మేకర్ ఇంటెల్ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మూడు నెలల జీతం లేని సెలవులతో వేలాదిమంది పారిశ్రామిక కార్మికులను ఇంటికి పంపిస్తోంది. క్లిక్ చేయండి: పాన్-ఆధార్ లింక్ చేశారా? లేదంటే భారీ షాక్ తప్పదు! డెడ్‌లైన్ ఎపుడో తెలుసా? తాజా మీడియా నివేదికల ప్రకారం ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఇంటెల్ కాలిఫోర్నియాలో 201 మంది ఉద్యోగులపై వేటు వేసింది. "వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ల" ప్రకారం 111 మంది ఉద్యోగులను తొలగించగా, 90 మంది ఉద్యోగులను కంపెనీ హెడ్ క్వార్టర్ శాంటా క్లారా లొకేషన్ నుంచి బయటికి పంపింది. 2023 జనవరి 31 నుండి తొలగింపులు ప్రారంభం కానున్నాయి. 2025 చివరి నాటికి, ఇంటెల్ సంవత్సరానికి 8-10 బిలియన్ల డాలర్లమేర ఆదా చేయాలని భావిస్తోందట. (మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు: ఆలస్యం చేస్తే..!) ప్రస్తుత వాతావరణానికి తగినట్టుగా ఖర్చులను తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అక్టోబరులో కంపెనీ మూడవ త్రైమాసిక ఫలితాల కాల్ సందర్భంగా, ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ వెల్లడించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పీసీ విక్రయాలు పడిపోవడంతో ఇంటెల్ వేలాదిమందిని తొలగించనుందని గతంలోనే నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే. (5జీ, ఇతర స్మార్ట్ఫోన్లపై అమెజాన్‌లో అదరిపోయే ఆఫర్లు) కాగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 853 కంప్యూటర్ వ్యాపార సంస్థలు దాదాపు 137,492 మంది కార్మికులను తొలగించాయి. రానున్న ఆర్థిక మాంద్యం ఆందోళనల మధ్య ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మెటా, ట్విటర్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సహా అనేక ఇతర కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపులో ముందంజలో ఉన్నాయి. -
2022 హీట్ దెబ్బ.. వేల మంది దుర్మరణం
కోపెన్‌హగ్: మునుపెన్నడూ లేని రేంజ్లో ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు యూరప్‌ను అతలాకుతలం చేశాయి. ఈ ఒక్క ఏడాదిలోనే అదీ యూరప్‌లోనే 15 వేల మందికి పైగా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ప్రకటించింది. వడగాల్పులకు ముఖ్యంగా స్పెయిన్, జర్మనీ దారుణంగా ప్రభావితం అయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. జూన్ నుంచి ఆగష్టు మధ్య యూరప్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొన్ని శతాబ్దాలుగా ఇదే అత్యధిక కావడం గమనార్హం. దేశాల నుంచి సమర్పించిన నివేదికల ఆధారంగా కనీసం 15వేల మంది మరణించారని, ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో రీజినల్ డైరెక్టర్ ఫర్ యూరప్ అయిన హాన్స్ క్లూగే ఒక ప్రకటనలో వెల్లడించారు. స్పెయిన్‌లో 4వేల మరణాలు, పోర్చుగల్‌లో వెయ్యి, యూకేలో 3,200 మరణాలు, జర్మనీలో 4,500 మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. జూన్, జులై మధ్యకాలంలో 40 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు బ్రిటన్‌కు ముచ్చెమటలు పోయించాయి. వేడిమి వల్ల ఒత్తిళ్లు, శరీరం చల్లదనంగా ఉండకపోవడం.. తదితర కారణాలతోనే మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, డయాబెటిస్ ఉన్నవాళ్లకు అధిక వేడిమి మరింత ప్రమాదమని నిపుణులు తెలిపారు. కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే దశాబ్దాలలో పెరుగుతున్న వేడిగాలులు, ఇతర తీవ్రమైన వాతావరణ సమస్యలు.. మరిన్ని వ్యాధులు, మరణాలకు దారితీస్తుందని WHO పేర్కొంది. ఇదీ చదవండి: నరకకూపం.. ప్రమాదం అంచున ప్రపంచం -
రాత్రికిరాత్రే వందలాది పక్షులు మృతి
-
దుబాయ్ వెళ్లే విమానాలు రద్దు
న్యూఢిల్లీ: దుబాయ్ విమానాశ్రయంలో ఎమిరేట్స్ విమాన ప్రమాదం పలు విమానాల రద్దుకు దారి తీసింది. మరికొన్నింటిని షార్జా, అబుదాభి విమానాశ్రయాల ద్వారా దారి మళ్లించాల్సి వచ్చింది. కేవలం పెద్ద విమానాలకు మాత్రమే దుబాయ్ ఎయిర్ పోర్ట్ అనుమతిస్తోంది. ఈ ఆటంకాలకు శనివారం ఉదయానికి తెరపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యలో భారత విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కూడా ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు. గురువారం ఇండిగో, స్పైస్ జెట్ విమానాలు కాన్సిల్ అయినట్టు తెలిపారు. ముఖ్యంగా వైడ్ బాడీ విమానాలకు మాత్రమే శుక్రవారం వరకూ అనుమతి ఉందని, ఎయిర్ ఇండియా జెట్ ఎయిర్ వేస్ కు మాత్రమే ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇటు ఇండియా నుంచి దుబాయ్ మీదుగా వెళ్లే పలు విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రముఖ విమానయాన సంస్థలు కూడా ప్రకటించాయి. ఢిల్లీ నుంచి దుబాయ్ కు వెళ్లే విమానాలను రీషెడ్యూల్ చేసినట్టు జెట్ ఎయిర్వేస్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. వరుస ట్విట్లతో ప్రయాణికులకు అప్ డేట్ చేస్తోంది. ప్రయాణికుల సౌకర్యంకోసం సాధ్యంమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు స్పైస్ జెట్ ట్వీట్ చేసింది. అల్ మక్ టం అంతర్జాతీయ విమానాశ్రయం, రాస్ అల్ ఖైమాహ్, షార్జా మళ్లిస్తూ, తమ ప్రయాణీకులకు దుబాయ్ నగరం చేరుకోవడానికి వీలుగా ఈ విమానాశ్రయాల నుంచి ప్రయాణ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని స్పైస జెట్ తెలిపింది. ఇండిగో గురువారం పలు విమానాలనురద్దు చేసినట్టు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు ఒక ప్రకనటలో తెలిపింది. దుబాయ్ ఎయిర్ పోర్టులో రన్ వే అందుబాటులో లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. ప్రయాణికుల ఏర్పాట్లకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నామని ప్రకటించాయి. శుక్రవారం ఉదయం 7.30 వరకు ఉన్న విమానాలు అందుబాటులో వుండవని ఇండిగో తెలిపింది. ఆదివారం లిమిటెడ్ గా తమ సర్వీసులను నడుపుతామని తెలిపింది. ఇండిగో ప్యాసింజర్లు దీన్ని గమనించాలని కోరింది. ప్రయాణీకులు తమ తమ విమాన స్థితిని తనిఖీచేసుకోవాలని అభ్యర్థించింది. కాగా ఎమిరేట్స్ బుధవారం 27 విమానాలను రద్దు చేసింది. మిగిలినవాటిని దారి మళ్లించింది. అనుకోని సంఘటనతో దాదాపు 23 వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు బుధవారం, అంతకుముందు బుక్ చేసుకున్న టికెట్లు ఎలాంటి చార్జ్ లేకుండా క్యాన్సిల్ చేసుకోవచ్చని తెలిపాయి. 21.5 లక్షలమంది ప్రయాణికులతో ముంబై దుబాయ్ మధ్య అత్యంత రద్దీ గా ఉండే అంతర్జాతీయ మార్గంగా ఖ్యాతి గడించింది. దీనితర్వాత 17 లక్షలమందితో ఢిల్లీ-దుబాయ్ మార్గం రెండవ స్థానంలో నిలిచింది. Dubai- only widebody aircraft allwd till 7 AM tom. AI routing thru Sharjah, Jet thru Sharjah&Abudhabi & Indigo,Spicejet cncld today. — Ashok Gajapathi Raju (@Ashok_Gajapathi) August 4, 2016 (1/3) #TravelUpdate: Some of our flights to & from #Dubai are affected due to single runway operations at Dubai airport and contd… — Jet Airways (@jetairways) August 4, 2016 -
ఖరీదైన కార్లను అలా వదిలేశారు
-
రైతులకు 5వేల బైక్‌లు
డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు అశ్వారావుపేట: జిల్లాలోని రైతులకు సహకార సంఘం ద్వారా బైక్‌లను పంపిణీ చేయనున్నట్లు డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు అన్నారు. ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గుబ్బలమంగమ్మ తల్లి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అక్కడ విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రైతుల కోసం 5 వేల బైక్‌లు మంజూరయ్యాయని తెలిపారు. ఒక్కో సహకార సంఘానికి 50 కేటాయించినట్లు తెలిపారు. ముందుగా పాలేరు నియోజకవర్గంలో 800 బైక్‌లు ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు రైతు రుణాలను 50 శాతం రెన్యువల్ చేశామని, మిగిలిన రుణాలను వారంలోగా రెన్యువల్ చేస్తామన్నారు. ప్రతి రైతుకూ బ్యాంకు ఖాతా గుండానే నగదు చెల్లింపులు చేపట్టేందుకు 99 శాతం బ్యాంకు ఖాతాలను తెరిచామన్నారు. మిగిలిన రైతులకూ ఖాతాలు, ఏటీఎం కార్డులు కూడా అందజేస్తామన్నారు. మూడో విడత రుణమాఫీ 59 శాతం జమ అయిందన్నారు. ఆయన వెంట భద్రాచలం సొసైటీ డైరెక్టర్ గూడపాటి శ్రీను, సత్తుపల్లి సొసైటీ డైరెక్టర్ వెలిశాల చెన్నాచారి, కూకలకుంట సురేష్ తదితరులున్నారు. -
వేలాది ఉద్యోగులకు బైబై!
న్యూయార్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఇంటెల్.. తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది. ఇటీవలే ఇద్దరు ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటీవ్లకు ఉద్వాసన పలికిన ఈ సంస్థ.. ఈ ఏడాది చివరి నాటికి వేల సంఖ్యలో ఉద్యోగులకు బైబై చెప్పనుందని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇంటెల్ ఉత్పత్తులు ఆశించిన మేర అమ్మకాల్లో వృద్ధి సాధించకపోవటంతో ఇప్పటికే అమెరికాలో 1100 మంది ఉద్యోగులను తొలగించింది. 2015 డిసెంబర్ నాటికి ఇంటెల్ సంస్థలో ప్రంపంచ వ్యాప్తంగా 1,07,000 మంది పనిచేస్తున్నారు. అయితే అమెరికాలో మాదిరిగానే ఇతర ప్రాంతాల్లో సైతం భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది. కొన్ని చోట్ల సంస్థలోని 10 శాతానికి పైగా ఉద్యోగులను తొలగించాలని ఇంటెల్ భావిస్తున్నట్లు సమాచారం. ఇంటెల్‌కు పర్సనల్ కంప్యూటర్ మార్కెట్లో నిరాశాజనకమైన ఫలితాలు ఎదురౌతున్న నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని భావిస్తోంది. -
దీక్షా స్థలికి కదిలిన ప్రజా దండు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవదిక నిరహార దీక్షకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. దీక్షకు స్పందించి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు దండుగా కదిలారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోపాటు సామాన్య జనం కూడా కుప్పలుగా గుంటూరు శివారులోని నల్లపాడు రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన దీక్షా స్థలికి కదిలారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి దీక్షకు మద్దతుగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో 30 వాహనాల్లో బయలుదేరారు. అలాగే, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద ఎత్తున మద్దతుదారులతో దీక్ష వద్దకు కదిలారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పార్టీ కన్వీనర్ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు నేతలు కార్యకర్తలు తరలి వెళ్లారు. పెద్దకూరపాడు నియోజకవర్గం నుంచి పార్టీ నేత అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో బయలు దేరారు. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి గుత్తుల సాయి ఆధ్వర్యంలో 25 వాహనాల్లో కార్యకర్తలు వస్తున్నారు. అలాగే పీ గన్నవరం నియోజకవర్గం నుంచి కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో 50 వాహనాల్లో కార్యకర్తలు దీక్ష వద్దకు బయలుదేరారు. దర్శి నియోజకవర్గ ఇంఛార్జ్ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 150 వాహనాల్లో దీక్షకు బయల్దేరారు. -
భక్తులతో కిటకిటలాడుతున్న సోమేశ్వరాలయం