
మాట్లాడుతున్న మువ్వా విజయ్‌బాబు
- డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు
అశ్వారావుపేట: జిల్లాలోని రైతులకు సహకార సంఘం ద్వారా బైక్‌లను పంపిణీ చేయనున్నట్లు డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు అన్నారు. ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గుబ్బలమంగమ్మ తల్లి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అక్కడ విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రైతుల కోసం 5 వేల బైక్‌లు మంజూరయ్యాయని తెలిపారు. ఒక్కో సహకార సంఘానికి 50 కేటాయించినట్లు తెలిపారు. ముందుగా పాలేరు నియోజకవర్గంలో 800 బైక్‌లు ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు రైతు రుణాలను 50 శాతం రెన్యువల్ చేశామని, మిగిలిన రుణాలను వారంలోగా రెన్యువల్ చేస్తామన్నారు. ప్రతి రైతుకూ బ్యాంకు ఖాతా గుండానే నగదు చెల్లింపులు చేపట్టేందుకు 99 శాతం బ్యాంకు ఖాతాలను తెరిచామన్నారు. మిగిలిన రైతులకూ ఖాతాలు, ఏటీఎం కార్డులు కూడా అందజేస్తామన్నారు. మూడో విడత రుణమాఫీ 59 శాతం జమ అయిందన్నారు. ఆయన వెంట భద్రాచలం సొసైటీ డైరెక్టర్ గూడపాటి శ్రీను, సత్తుపల్లి సొసైటీ డైరెక్టర్ వెలిశాల చెన్నాచారి, కూకలకుంట సురేష్ తదితరులున్నారు.