
సాక్షి, న్యూఢిల్లీ : రామ్ జన్మభూమి కేసు విషయంలో వివాదాన్ని రాజేసి కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెట్టిన ఆ పార్టీ సీనియర్ నేత, న్యాయశాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్‌ను గుజరాత్ ఎన్నికల ప్రచారం నుంచి కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది. గుజరాత్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన ప్రచారానికి దూరంగా ఉండాలని సూచించింది. మంగళవారం సుప్రీంకోర్టులో రామజన్మభూమి కేసు విచారణ జరుగుతుండగా సున్నీ వక్ఫ్ బోర్డు తరుపున వాదనలు వినిపిస్తున్న సిబల్.. ఈ కేసును 2019 జులై వరకు వాయిదా వేయాలని, ఆలోగా సాధారణ ఎన్నికలు పూర్తవుతాయని అన్నారు.
దీంతో ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా తీసుకున్న బీజేపీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో తమకు అస్త్రంగా వాడుకుంది. బుధవారం అక్కడ ప్రచారంలో పాల్గొన్న మోదీ విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికలకు రామజన్మభూమికి ఎందుకు సంబంధం అంటగడుతున్నారని ప్రశ్నించారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ తమ ప్రచారానికి సిబల్ వ్యవహారం ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని ఆయనను దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment