
ఉచిత సలహాలు అవసరం లేదన్న కపిల్ సిబల్
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరంలో ఓటమిపాలైన కాంగ్రెస్ నేతలకు ఉచిత సలహాలు ఇస్తున్న వారిపై ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ మండిపడ్డారు. అవన్నీ తాము గతంలో గెలిచిన స్ధానాలేనని..తమ వారసులు భవిష్యత్‌లో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తమ ఓటమిపై సంబరాలు చేసుకోవద్దని..కసితో తమ పోరాటం కొనసాగిస్తామని..ఈ క్రమంలో తాము విజయవంతం కాకుంటే భవిష్యత్‌లో విజయాలకు బాటలు వేస్తామని కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి సొంతంగా 303 స్ధానాలను గెలుపొందిన సంగతి తెలిసిందే. విపక్ష కాంగ్రెస్ కేవలం 52 స్ధానాలకే పరిమితమైంది.