
సాక్షి,న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పట్ల మితిమీరిన విధేయత చూపుతున్న అధికారులపై తాము కన్నేసి ఉంచామని, ప్రభుత్వాలు శాశ్వతం కాదని, అవి మారుతుంటాయని వారు గుర్తెరగాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో తాము కొన్నిసార్లు విపక్షంలో ఉంటే మరికొన్నిసార్లు అధికారంలో ఉంటామని, ప్రభుత్వ అధికారులు ఈ విషయం గమనించాలన్నారు.
ప్రధాని పట్ల అతివిధేయత కనబరుస్తున్న అధికారులపై తాము కన్నేసి ఉంచామని, రాజ్యాంగం అన్నింటికంటే పెద్దదన్న సంగతి అధికారులు గుర్తుపెట్టుకోవాలన్నారు. కాగా గవర్నర్ కార్యాలయలు, వర్సిటీ వీసీలు, మీడియా సహా అన్ని వ్యవస్ధలపైనా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దాడి చేస్తోందని ఇటీవల కపిల్ సిబల్ ఆరోపించారు. కళాకారులు, రచయితలపై దేశద్రోహం అభియోగాలు మోపుతున్నారని, కొందరు మాట్లాడుతుంటే అడ్డుకుని భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment