న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, హోం మంత్రి అమిత్ షా, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్‌లకు కెనడాలో సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ తీవ్ర హెచ్చరికలు చేశాడు. భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కెనడాలోని సర్రే, వాంకోవర్‌లలో వేర్పాటువాదులు రెఫరెండం నిర్వహించిన విషయం తెలిసిందే.
అంతకుముందు, పన్నూ సుమారు 5 వేల నుంచి 7 మంది వరకు పాల్గొన్న సమావేశంలో భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అందుకు సంబంధించిన ఒక వీడియో విడుదలైంది. ‘హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను చంపిన వారికిదే నా హెచ్చరిక. మిమ్మల్ని ఘోరంగా చంపాలని పిలుపునిస్తున్నాం. మోదీ, జై శంకర్, దోవల్, షా.. మేం మీకోసం వస్తున్నాం’ అని పన్నూ హెచ్చరిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న నిజ్జర్ ఈ ఏడాది జూన్‌లో సర్రేలో హత్యకు గురైన విషయం తెలిసిందే. భారత వ్యతిరేక శక్తులు కెనడాలో తిష్టవేశాయని స్వయంగా ఆ దేశ ప్రధాని ట్రూడో ఎదుటే ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసిన రోజే పన్నూ ఈ సమావేశం జరిపారు.
Can anyone predict the fate of #GurpatwantSinghPannu? https://t.co/nnxJvZOxLS
— Kartick Kumar Misraa (@kartickmisraa) September 13, 2023
ఇది కూడా చదవండి: పార్లమెంట్ ఉద్యోగులకు కొత్త యూనిఫామ్..
Comments
Please login to add a commentAdd a comment