‘2002 అల్లర్ల వల్ల గుజరాత్‌లో సౌభ్రాతృత్వం, మత సామరస్యం దారుణంగా దెబ్బతిన్నాయి. చేతులు జోడించి మోడీని వేడుకుంటున్నాం
న్యూఢిల్లీ/దావోస్: ‘2002 అల్లర్ల వల్ల గుజరాత్‌లో సౌభ్రాతృత్వం, మత సామరస్యం దారుణంగా దెబ్బతిన్నాయి. చేతులు జోడించి మోడీని వేడుకుంటున్నాం. మరే ఇతర రాష్ట్రాన్ని గుజరాత్‌లా చేయాలనుకోవద్దు. రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లడం వల్ల జాతినిర్మాణం జరగదు. నిర్మాణాత్మక కార్యక్రమాలు, పథకాలతో ముందుకురావాలి. యూపీ నుంచి గుజరాత్‌లో ప్రవేశించగానే రైలు ప్రయాణికులు సురక్షితంగా భావిస్తారని మోడీ అంటున్నారు. గతంలో అయోధ్య నుంచి వచ్చిన రైలు(గోద్రా) ప్రయాణికులపై జరిగిన దారుణాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు.
‘అవినీతిపై మాట్లాడే మోడీ.. తన మంత్రివర్గ సహచరుడు బాబూలాల్ బొఖారియా దోషిగా తేలితే.. ఆయనను కనీసం పదవి నుంచి తొలగించలేదు. యడ్యూరప్పను తిరిగి బీజేపీలో చేర్చుకోవడంపై కూడా స్పందించలేదు’. - కపిల్ సిబల్
మోడీది అత్యంత వివాదాస్పద గతం. దాన్ని మర్చిపోవడం అంత సులభం కాదు. అది ఎవరికీ సాధ్యం కాదు. గత చరిత్రను మర్చిపోమని ప్రజలకు చెప్పలేం. దాని ఆధారంగానే మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు’.
- కేంద్రమంత్రి చిదంబరం