
సినీ పాటల రచయితగా కపిల్ సిబల్
ముంబై: కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సినీ గేయ రచయితగా మారారు. త్వరలో విడుదలయ్యే షోర్గుల్ సినిమా కోసం ‘తేరే బినా’, ‘మస్త్ హవా’ పాటలకు సాహిత్యాన్ని అందించారు. ‘మస్త్ హవా’ పాటను హృషితా భట్, జిమ్మి షెర్గిల్‌పై చిత్రీకరించగా ప్రతిభా సింగ్ బాఘెల్ ఆలపించారు. తాను రొమాంటిక్ వర్గానికి చెందినవాడినని సిబల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.