
సాక్షి, కర్నూలు : జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దుండగులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తుగ్గలి నాగేంద్రకు సంబంధించిన ఆస్తుల మీద దాడి చేశారు. నాగేంద్ర రైల్వే పనులకు ఉపయోగిస్తున్న రెండు టిప్పర్లు, నాలుగు హిటాచీ వాహనాలను ధ్వంసం చేయడమే కాక పని వారి మీద కూడా దాడి చేశారు.
డిప్యూటి సీఎం కొడుకు అనుచరులే తన మీద దాడి చేశారని ఆరోపిస్తున్నారు నాగేంద్ర. దాడి చేయడానికి వచ్చిన మనుషులు సీఎం కొడుకు శ్యాంబాబు వాహనంలోనే వచ్చారని తెలిపారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే ఇలాంటి దాడులకు పాల్పడ్డారని నాగేంద్ర ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment