వివిధ నేరాలకు పాల్పడి పోలీసుల అదుపులో ఉన్న ఓ పాత నేరస్తుడు పోలీస్‌స్టేషన్ నుంచి తప్పించుకుపోయాడు. కర్నూలు జిల్లా కేంద్రంలోని నాలుగో పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ధర్మపేటకు చెందిన నాగేంద్ర(35) వివిధ నేరాలకు పాల్పడి మూడు నెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు.
అయితే, అటుతర్వాత కూడా అతడి తీరు మారలేదు. తిరిగి నేరాలకు పాల్పడుతుండటంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంగళవారం రాత్రి సెంట్రీ కానిస్టేబుల్ ఏమరుపాటుగా ఉన్న సమయంలో నాగేంద్ర పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.