old offender
-
పుణె బస్టాండ్‌లో దారుణం
పుణె: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు. గతంలో ఇతనిపై దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు సతారా జిల్లాలోని ఫల్టణ్ పట్టణానికి వెళ్లే బస్సు ఎక్కేందుకు బాధిత మహిళ ఈ బస్టాండ్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ వద్ద వేచిచూస్తోంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన నిందితుడు ‘సోదరీ’ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. తాను బస్ కండక్టర్‌ను అని, మీరు ఎక్సాలిన బస్సు సమీపంలో ఆగి ఉందని చెప్పి, సమీపంలో ఆగి ఉన్న ‘శివ్ షాహీ’ ఏసీ బస్సును చూపించాడు. అది మీరు వెళ్లాల్సిన రూట్లో వెళ్తుందని చెప్పి ఆ బస్సు ఎక్కాలని ఆమెకు సలహా ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన ఆమె ఎవరూ లేని ఆ బస్సు ఎక్కింది. లైట్లు ఆఫ్ చేసి, చిమ్మచీకటిగా ఉన్న బస్సును ఎక్కేందుకు తొలుత ఆమె తటపటాయించింది. బస్సులో ప్రయాణికులు నిద్రిస్తుండటంతో లైట్లు ఆర్పివేశారని, నచ్చజెప్పి బస్సులో లోపలిదాకా వెళ్లేలా చేశాడు. వెంటనే వెనకాలే వచ్చిన అతను బస్సు తలుపు మూసేసి, ఆమెను రేప్‌చేసి పారిపోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్మార్థనా పాటిల్ చెప్పారు. ఘటన జరిగినప్పుడు బస్టాండ్‌లో ఎన్నో బస్సులు, ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు. మహిళ తనకు జరిగిన అన్యాయంపై వెంటనే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఫల్టణ్కు వెళ్లే బస్సు ఎక్కి మార్గమధ్యంలో తన స్నేహితురాలికి ఫోన్‌చేసి ఘోరాన్ని వివరించింది. ఆమె సలహామేరకు బాధితురాలు వెంటనే బస్సు దిగి సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్చేసేందుకు పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటుచేసి వేట మొదలెట్టారు. పోలీస్‌స్టేషన్‌కు ఈ బస్టాండ్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. నిందితుడు గతంలో ఒక కేసులో బెయిల్ సంపాదించి 2019 ఏడాది నుంచి బయటే ఉన్నాడు.విపక్షాల విమర్శలు‘‘ఏమాత్రం భయం లేకుండా అసాంఘిక శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. పుణెలో నేరాలను అరికట్టడంలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం విఫలమయ్యారు’’ అని ఎన్సీపీ(ఎస్పీ) నాయ కురాలు, ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు. -
ఘరానా దొంగ అరెస్ట్
పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. -
పోలీస్ కస్టడీ నుంచి దొంగ పరారు
వివిధ నేరాలకు పాల్పడి పోలీసుల అదుపులో ఉన్న ఓ పాత నేరస్తుడు పోలీస్‌స్టేషన్ నుంచి తప్పించుకుపోయాడు. కర్నూలు జిల్లా కేంద్రంలోని నాలుగో పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ధర్మపేటకు చెందిన నాగేంద్ర(35) వివిధ నేరాలకు పాల్పడి మూడు నెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే, అటుతర్వాత కూడా అతడి తీరు మారలేదు. తిరిగి నేరాలకు పాల్పడుతుండటంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంగళవారం రాత్రి సెంట్రీ కానిస్టేబుల్ ఏమరుపాటుగా ఉన్న సమయంలో నాగేంద్ర పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
పాత నేరస్తుడే కిడ్నాపర్
విశాఖపట్నం: వారం రోజుల క్రితం చింతలగ్రహారం గవరపాలెం కాలనీకి చెందిన కొరుబిల్లి దామోదర్(9)ను కిడ్నాప్ చేసినవారిలో ఒకడు పాత నేరస్తుడేనని పోలీస్ అధికారులు తెలిపారు. పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించి బాలుడిని నిన్న సురక్షితంగా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కిడ్నాపర్లు ఇద్దరినీ అరెస్ట్ చేసి ఈ రోజు మీడియా ముందు హాజరుపరిచారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితులలో ఒకడు శ్రీకాకుళంకు చెందిన కింతాల కేశవరావు కాగా, రెండవవాడు విశాఖపట్నం చంద్రశేఖర్ అని చెప్పారు. వీరిలో కేశవరావు 2005లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని తెలిపారు. పోలీసులు చాలా కష్టపడి ఈ కేసుని ఛేదించినట్లు తెలిపారు. బాలుడు సురక్షితంగా దొరకడం తమ విజయంగా చెప్పారు. కిడ్నాపర్ల నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ** -
ఏటీఎం పాతనేరస్తుడి అరెస్టు
బాపట్ల టౌన్, న్యూస్‌లైన్ :ఏటీఏం కేంద్రాలకు వచ్చే అమాయకులను మభ్యపెట్టి వాళ్ల నగదును స్వాహా చేసే ఏటీఏం పాతనేరస్తుడు కాటూరి వెంకటేష్‌ను గురువారం పట్టణ పోలీసులు అరెస్టుచేశారు. 13 నెలల వ్యవధిలో వెంకటేష్ రెండుసార్లు అరెస్టవడం గమనార్హం! గతంలో కూడా ఇలాంటి నేరాలకే పాల్పడి అరెస్లు అయి బెయిల్ పై బయటకు వచ్చినప్పటీ అతని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈనెల 30న బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బిల్లా తారక మల్లేశ్వరరావు పాతబస్టాండ్ సెంటర్లో ఉన్న ఏటీఎంలో డ్రా చేసేందుకు వెళ్లాడు .ఏటీఎంలో నుంచి నగదు రాకపోవడంతో సెక్యూరిటీను పిలిచారు. అదే సమయంలో అక్కడ ఉన్న వెంకటేష్.. తానే సెక్యూరిటీ గార్డును అని చెప్పి కార్డు రెండుసార్లు పెట్టి అతని పిన్‌కోడ్ తెలుసుకున్నాడు. అదే గదిలో పక్కనే ఉన్న మరో ఏటీఏంలో కార్డును స్వైప్ చేసి ఏటీఏం పనిచేయడం లేదని అతనికి కార్డు ఇచ్చేశాడు. అతను బయటకు వెళ్లిన వెంటనే పిన్‌కోడ్ ఎంటర్‌చేసి రూ. 3 వేలు డ్రాచేశాడు. అప్పటినుంచి పోలీసులు ఏటీఏం కేంద్రాల్లో ఉన్న సీసీ కెమెరాలు, స్థానికులను విచారించగా వెంకటేష్ బండారం బయటపడింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి మూడు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరం మండలం, వీరంకివారిపాలేనికి చెందిన కాటూరి వెంకటేష్ అనేక పర్యాయాలు ఏటీఏం నేరాలకు పాల్పడి లక్షలాది రూపాయల నగదు కాజేసిన సంఘటనలు ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, తిరుపతి, బాపట్ల, హైదరాబాద్ ప్రాంతాల్లోని ప్రాధాన కూడళ్లలోని ఏటీఏంలు.., సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం కేంద్రాల వద్ద తానే సెక్యూరిటీ గార్డు అని చెప్పి అమాయకుల ఏటీఏం కార్డు రహస్య నంబర్ తెలుసుకొని డూప్లికేట్ ఏటీఏం కార్డు తిరిగి ఇచ్చి తర్వాత ఆ ఖాతాలో ఉన్న నగదు స్వాహా చేయడం షరామామూలే!