
సురక్షితంగా ఇంటికి చేరిన దామోదర్ - కుటుంబ సభ్యుల ఆనందం
విశాఖపట్నం: వారం రోజుల క్రితం చింతలగ్రహారం గవరపాలెం కాలనీకి చెందిన కొరుబిల్లి దామోదర్(9)ను కిడ్నాప్ చేసినవారిలో ఒకడు పాత నేరస్తుడేనని పోలీస్ అధికారులు తెలిపారు. పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించి బాలుడిని నిన్న సురక్షితంగా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కిడ్నాపర్లు ఇద్దరినీ అరెస్ట్ చేసి ఈ రోజు మీడియా ముందు హాజరుపరిచారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
నిందితులలో ఒకడు శ్రీకాకుళంకు చెందిన కింతాల కేశవరావు కాగా, రెండవవాడు విశాఖపట్నం చంద్రశేఖర్ అని చెప్పారు. వీరిలో కేశవరావు 2005లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని తెలిపారు. పోలీసులు చాలా కష్టపడి ఈ కేసుని ఛేదించినట్లు తెలిపారు. బాలుడు సురక్షితంగా దొరకడం తమ విజయంగా చెప్పారు. కిడ్నాపర్ల నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
**