పరారీలో ఎమ్మెల్యే బొండా ఉమ తనయుడు! | tdp mla bonda umamaheswara rao son sidhartha go under ground | Sakshi
Sakshi News home page

పరారీలో ఎమ్మెల్యే బొండా ఉమ తనయుడు!

Published Tue, Oct 28 2014 10:39 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

పరారీలో ఎమ్మెల్యే బొండా ఉమ తనయుడు! - Sakshi

పరారీలో ఎమ్మెల్యే బొండా ఉమ తనయుడు!

విజయవాడ :  విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.  గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన కారు రేసు కేసులో సిద్ధార్థతో పాటు మరో ఏడుగురిపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  

 

అప్పటి నుంచి సిద్ధార్థ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మరోవైపు పోలీసులు కూడా ఎమ్మెల్యే కుమారుడు అనే ఉద్దేశ్యంతోనే ఈ కేసులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా కారు రేసు ఘటనలో  ఇంజినీరింగ్ విద్యార్థి నాగేంద్ర (22) మృతి చెందిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement