పొలంలో కలియతిరుగుతున్న విద్యార్థికి పాముకాటు వేయడంతో మృతి చెందాడు.
గుత్తి రూరల్: పొలంలో కలియతిరుగుతున్న విద్యార్థికి పాముకాటు వేయడంతో మృతి చెందాడు. వివరాల్లోకెళితే.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడ్రాయి గ్రామానికి చెందిన సిద్ధరామప్ప, బాలమ్మ దంపతుల కుమారుడు ఎం.నాగేంద్ర (17) అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎంఎస్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.
మంగళవారం తల్లిదండ్రులతో కలిసి సజ్జ పంటను పరిశీలించేందుకు పొలానికి వెళ్లిన నాగేంద్రకు పాము కాటు వేసింది. బాధతో బిగ్గరగా కేకలు వేయగానే తల్లిదండ్రులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.