ఈ చేప రూ. ముప్పై వేలు | Fisherman spots rare fish in Chirala | Sakshi
Sakshi News home page

ఈ చేప రూ. ముప్పై వేలు

Published Mon, Aug 8 2016 8:09 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

ఈ చేప రూ. ముప్పై వేలు

ఈ చేప రూ. ముప్పై వేలు

చీరాల: అరుదుగా దొరికే కలిచా (ఎర్రపండు చేప) ఆదివారం ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవులో మత్స్యకారుల వలకు చిక్కింది. శనివారం ఉదయం వేటకు వెళ్లిన గంగులు తన బృందంతో వేట చేస్తుండగా 25 కిలోల బరువున్న ఈ చేప గాలానికి చిక్కిందని మత్స్యకారులు తెలిపారు.

కేన్సర్, మెదడు సంబంధ వ్యాధులను నయం చేసే ఔషధాల తయారీలో ఈ చేపను ఎక్కువగా వినియోగిస్తుంటారని పేర్కొన్నారు. తీరం ఒడ్డున నిర్వహించిన వేలంలో బెంగళూరుకు చేపలను ఎగుమతి చేసే నాగేంద్ర అనే వ్యాపారి దీన్ని  రూ.30 వేలకు దక్కించుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement