
పహాడీషరీఫ్ : మృగశిర కార్తెను పురస్కరించుకొని జల్‌పల్లి పెద్ద చెరువులో మత్స్యకారులు వేసిన వలలకు అరుదైన చేపలు చిక్కాయి. వాటిని చూసి మత్స్యకారులు, ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటివరకు ఇలాంటి చేపలను చూడలేదని పేర్కొన్నారు. నలుపు రంగు చారలు, అధిక సంఖ్యలో ముళ్లు కలిగి ఉన్న వీటిని కొనుగోలు చేసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. తాము ఇలాంటి చేప పిల్లలను చెరువులో వదలలేదని, ఈ జాతి మొదటి నుంచే ఉండొచ్చని మత్స్యకారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment