
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు
మలికిపురం: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది పల్లిపాలెంలో మత్స్యకారులకు మంగళవారం సముద్రంలో అరుదైన సముద్ర శీలావతి, కచ్చా గొరక చేపలు లభించాయి. సముద్ర శీలావతి చేప సుమారు నాలుగు అడుగుల పొడవుంది.
వెన్నుపై రంగురంగులతో ఉన్న ఈ చేప స్థానికులను ఆకర్షించింది. కచ్చా గొరక చేప సుమారు 12 కిలోల బరువుంది. సముద్ర శీలావతి అరుదుగా లభిస్తుందని, కచ్చా గొరక సాధారణంగా ఇంత బరువు ఉండదని మత్స్యకారులు చెప్పారు.