SC Allow SIT Enquiry On TDP Regime Scam: Sajjala Samakrishna Reddy - Sakshi
Sakshi News home page

అవినీతి మొత్తం బయటకు తీస్తాం.. అరెస్టులు కూడా జరుగుతాయి: సజ్జల

Published Wed, May 3 2023 3:43 PM | Last Updated on Wed, May 3 2023 4:06 PM

Sajjala Samakrishna Reddy SC Allow SIT Enquiry On TDP Regime Scam - Sakshi

సాక్షి, తాడేపల్లి: అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జరిగిన అవినీతి మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. సిట్‌ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. కచ్చితంగా అరెస్టులు కూడా జరుగుతాయని అన్నారు.

సుప్రీంకోర్టులోఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి భారీ విజయం దక్కిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. విధానపరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే తప్పేనని పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పులను తప్పకుండా సమీక్ష చేయాల్సిందేనని తెలిపారు. రాష్ట్ర సంపదకు నష్టం కలిగించే కుట్రలను బయటకు తీస్తామన్నారు. టీడీపీ హయాంలో తప్పు చేయకపోతే వారికి భయమెందుకని ప్రశ్నించారు.
చదవండి: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలోనూ చంద్రబాబు హస్తం ఉందని సజ్జల పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేట్‌ స్కాంకు రాజధాని పేరు పెట్టారని.. అమరావతి పేరు చెప్పి దోచుకోవాలనుకున్నారని మండిపడ్డారు. అరచేతిలో స్వర్గం చూపించి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలిక నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడ్డరన్నారు. టీడీపీ హయాంలో దేశంలోనే అతిపెద్ద భూ కంభకోణం జరిగిందన్నారు. నిజనిజాలను బయటకు తీసేందుకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

రాజధాని పేరుతో చంద్రాబాబు ముఠా దోచుకున్నారని సజ్జల దుయ్యబట్టారు. తప్పు చేయకపోతే స్టే కోసం కోర్టులకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ సహా చంద్రబాబు ముఠాకు ఎందుకంత భయమని అన్నారు. టీడీపీ హయాంలో అక్రమాలపై సిట్‌ ఏర్పాటు జరిగిందని, సిట్‌ దర్యాప్తుపై స్టే తెచ్చుకుంటే అందులో ఏదో మతలబు ఉన్నట్లేనని అన్నారు. టీడీపీ నేతల్లో ఒకవైపు భయం, మరోవైపు అహంకారం కనిపిస్తోందన్నారు. సిట్‌ ఏర్పాటు కక్ష సాధింపు కానే కాదని స్పష్టం చేశారు. 
చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement