సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కేసులో తమ దర్యాప్తు సజావుగానే సాగుతోందని, సీబీఐ అవసరం లేదని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(SIT) తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. పేపర్ లీకేజ్ కేసులో దర్యాప్తు రిపోర్ట్‌ను మంగళవారం హైకోర్టుకు సమర్పించింది సిట్. ఆ స్టేటస్ రిపోర్ట్‌లో కీలకాంశాలను ప్రస్తావించింది.
ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు ఆధారంగా.. మొత్తం 250 పేజీల రిపోర్ట్‌తో పాటు ఎంక్లోజర్స్‌ను సైతం తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది సిట్. ‘‘పేపర్ లీక్ కేసులో.. రూ.40 లక్షల నగదు బదిలీ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించాం. పేపర్ కొనుగోలు చేసిన 15 మందిని అరెస్ట్ చేశాం. శంకర్ లక్ష్మిని సాక్షిగా పరిగణించాం. సాక్షులు, నిందితులు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్, కమిషన్ మెంబర్‌ను సైతం ప్రశ్నించాం. వాళ్ల నుంచి సేకరించిన స్టేట్‌మెంట్స్ ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించాం.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చాం. కానీ, పొలిటికల్ లీడర్స్ నుంచి ఎలాంటి కీలక సమాచారం అందలేదు. గతంలో ఎన్నో సెన్సేషన్ కేసుల్ని డీల్ చేశాం. ఈ పేపర్ లీక్ కేసును సైతం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నాం. కాబట్టి.. ఈ కేసు విచారణలో సీబీఐ అవసరం లేదు. కేసులో కీలకమైన ఎఫ్‌ఎస్‌ఎల్(FSL) రిపోర్ట్ రావాల్సి ఉంది. అది వస్తే.. కేసులో మరింత పురోగతి సాధించొచ్చు అని హైకోర్టుకు సమర్పించిన కేసు స్టేటస్ రిపోర్ట్‌లో సీబీఐ పేర్కొంది.
ఇదీ చదవండి: బండి సంజయ్ మూడు సింహాల ప్రమాణంపై రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment