చంద్రబాబు అరెస్టు | High Tension In Nandyala To Arrest Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

చంద్రబాబు అరెస్టు

Published Sat, Sep 9 2023 4:58 AM | Last Updated on Sat, Sep 9 2023 1:39 PM

High tension in Nandyala to Arrest Chandrababu Naidu - Sakshi

నంద్యాల: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబును  పోలీసులు అరెస్టు చేశారు.  నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్‌ హాల్‌ వద్ద ఆయన్ను అరెస్ట్‌ చేశారు సీఐడీ పోలీసులు. ఈ రోజు(శనివారం) తెల్లవారుజామున చంద్రబాబును అరెస్ట్‌ చేశారు పోలీసులు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది.  ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద  కేసులు నమోదు చేశారు.

చంద్రబాబు అరెస్ట్‌ సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు భారీగా చేరుకొని పోలీసులను అడ్డుకునేందుకు యత్నించారు . చంద్రబాబును కలువ నీయకుండా అడ్డుగా నిలబడి పోలీసు అధికారులతో టిడిపి నాయకులు వాగ్వాదానికి దిగారు .



తమ నాయకుడు చంద్రబాబు విశ్రాంతిలో ఉన్నాడని, ఉదయం కలవండి అంటూ అధికారులతో టిడిపి నాయకులు వాధించారు. ఉదయం 6 గంటల తర్వాత చంద్రబాబునుకలవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులను పిలిపించారు పోలీసులు. చంద్రబాబుతో పాటు పలువురు టిడిపి నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ప్రజాధన కుంభకోణం.. అరెస్టు.. పదేళ్ల జైలు!

చంద్రబాబుపై అభియోగాలు..

👉ప్రభుత్వ డబ్బు రూ.371 కోట్లు అవినీతి

👉షెల్‌ కంపెనీల ద్వారా రూ. 241 కోట్ల కుంభకోణం

👉 కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి… డబ్బులు కాజేశారని అభియోగాలు.

👉స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరిట స్కాం ఇది. 

👉ఈడీ, సెబీ… ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తుచేసిన స్కాం ఇది. 

👉దోచేసిన సొమ్మును విదేశాలకు అక్కడనుంచి తిరిగి దేశంలోకి వచ్చింది. 

👉చంద్రబాబుగారు జూన్‌ 2014లో అధికారం చేపట్టిన 2 నెలలకే  ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంకు ఊపిరి.

👉ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అని, 90 శాతం సీమెన్స్‌ పెట్టుకుంటుందని చెప్పారు. అంటే దాదాపుగా రూ.౩వేల కోట్ల రూపాయలు సీమెన్స్‌ ఇస్తుందని చెప్పారు. 

👉తమకు తాముగా తయారుచేసుకున్న అంచనా వ్యయాన్నే డీపీఆర్‌గా చూపిస్తూ స్కిల్‌డెవల్‌మెంట్‌ నుంచి నోట్‌ పెట్టించారు. ఇక ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి, ఆపైస్థాయి అన్నింటినీ ఓవర్‌రూల్‌ చేస్తూ కేబినెట్‌లోకి ఈనోట్‌ను తీసుకొచ్చారు. అదీ ఒక స్పెషల్‌ ఐటెంగా. కేబినెట్లోకి అలా రావడం, వెంటనే దానికి ఓకే చెప్పడం, తర్వాత జీవో విడుదల కావడం... అన్నీ ఆగమేఘాలమీద జరిగిపోయాయి. 

👉ఈ పద్ధతిలో కేబినెట్‌కు నోట్‌ పెట్టడం అన్నది నియమాలకు, నిబంధలనకు, రూల్స్‌కు పూర్తిగా విరుద్ధం. 

👉ఇక ఒప్పందం విషయానికొస్తే.. జీఓ ఒకలా ఉంటుంది, ఒప్పందం ఇంకోలా ఉంటుంది. 

👉జీవోలో ఉన్నది... ఒప్పందంలో లేనప్పుడు సంతకాలు చేశారు?.

👉సీమెన్స్‌ నుంచి రావాల్సిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఒక్కపైసాకూడా రాకుండానే 5 దఫాలుగా ప్రభుత్వం రూ. 371 కోట్లు ఎలా విడుదలచేసింది. 

👉డబ్బు విడుదలపై ఆర్థికశాఖ అధికారులు కొర్రీలు పెడితే… విడుదల చేయమని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

👉ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ తన నోట్‌ఫైల్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదలచేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా రాశారు.

👉సీఎంగారు చెప్పారు కాబట్టి విడుదలచేయమని చీఫ్‌ సెక్రటరీ నేరుగా ఫైలుపై రాశారు. 

👉అన్నికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదలచేసిన ఈ డబ్బు పోయింది

👉మన అధికారులేకాదు… సీమెన్స్‌ సంస్థకూడా ఇంటర్నల్‌ ఎంక్వయిరీ చేసి… 164 సీఆర్పీసీ కింద ఏకంగా మెజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారు. 

👉ప్రభుత్వం జారీచేసిన జీవోకు, ఎంఓయూకు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు కోర్టుకు తెలిపారు. 

👉తమ కంపెనీలో పనిచేసే సుమన్‌బోస్‌ అనే వ్యక్తి మేనేజ్‌మెంట్‌నుగాని, లీగల్‌టీమ్‌కాని సంప్రదించలేదని సీమెన్స్‌ వాళ్లు ఏకంగా కోర్టుకు తెలియజేశారు. 

👉ఈ డబ్బు 70కిపైగా షెల్‌ కంపెనీల ద్వారా చేతులు మారి మారి తిరిగి వచ్చింది, 

👉వాస్తవంగా ఈ స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కాం గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి ఒక విజిల్‌బ్లోయర్‌ ఈ రకంగా జూన్‌ 2018న ఒక హెచ్చరిక జారీచేశారు. విచారణ మొదలుపెట్టి… దాన్ని ముందుకు కొనసాగించనీయకుండా పక్కనపెట్టేశారు. 

👉ఇది ఎప్పుడైతే జరిగిందో… వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను మాయంచేసేశారు.

👉స్కిల్‌ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్‌పీ/స్కిల్లర్‌, డిజైన్‌టెక్‌ …

👉ఈరెండు కంపెనీలు సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టకుండా సెన్‌వాట్‌కోసం క్లెయిమ్‌ చేశాయి. ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిం చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి... ఆ కంపెనీ లావాదేవీలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టు వెల్లడైంది. 2017లోనే ఇది బయటపడింది. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం స్పందనలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement