సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో బోర్డుపై సిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చినా సరైన సమాచారం ఇవ్వలేదని సిట్ అధికారులు సీరియస్ అయ్యారు. దర్యాప్తుకు సహకరిచకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బోర్డుకు వార్నింగ్ ఇచ్చారు. కాన్ఫిడెన్షియల్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మీ అంశంలో సిట్ కీలక సమాచారం సేకరించింది. శంకర్ లక్ష్మీ కాల్ డేటా వివరాలు సేకరించిన సిట్.. లీకేజీ అంశంలో శంకర్ లక్ష్మీ ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది.
కాగా 2015 నుంచి శంకర్ లక్ష్మీ టీఎస్‌పీఎస్‌సీలో విధులు కొనసాగిస్తున్నారు. DAO, AEE, AE, పేపర్ల అంశంలో టీఎస్‌పీఎస్‌సీ వివరాలు దాచిపెట్టనట్లు సిట్ గుర్తించింది.పేపర్లు వాల్యుయేషన్ చేయలేదని TSPSC తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలింది.
మరోవైపు రాథోడ్ వ్యవహారంలో సిట్ కీలక సమాచారం సేకరించింది. బుధవారం మరో సారి విచారణకు రావాలని రేణుకకు నోటీసులు అందించింది. రేణుక నుంచి ప్రవీణ్‌కు పేపర్ మొదటగా వెళ్లింది. రేణుక రాథోడ్ నుంచి గంబిరాం రాహుల్‌కు గ్రూప్ పేపర్ చేరింది. అతన్ని సొంత వాహనంలో హైదరాబాద్‌త ఈసుకొచ్చిన రేణుక.. సిటీలోని సీక్రెట్ రూమ్ బుక్‌చేసుకొని లీకైన పేపర్ ప్రిపేర్ చేయించింది.
అయితే ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్‌సీ సిట్‌కు ఇచ్చిన వివరాల్లో తేడాలు ఉన్నట్లు సిట్ అనుమానిస్తోంది. TSPSC వివరాల కోసం సిట్ RTI దాఖలు చేయలేదని సిట్ స్పష్టం చేసింది. RTI దాఖలు చేసినట్లువ స్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.
చదవండి: వంట మనిషి కొడుకు ‘సివిల్స్’ కొట్టాడు..
Comments
Please login to add a commentAdd a comment