
తెలంగాణలో కొన్ని రాజకీయ కుటుంబాల ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుంది. వాటిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుటుంబం గురించి ముందుగా తెలుసుకోవాలి. అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1962 నుంచి 2004 వరకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు నిర్వహిస్తే, 1994లో అసద్ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికీ కొనసాగుతున్నారు. 1999 నుంచి అసద్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తున్నారు. ఆ రకంగా అరవై ఒక్క సంవత్సరాలుగా ఒవైసీ కుటుంబం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడం విశేషం.
ఆ కుటుంబం పదిమార్లు లోక్‌సభకు
సలావుద్దీన్ 1962 నుంచి ఐదుసార్లు శాసనసభకు, ఆరుసార్లు ఎంపీగా హైదరాబాద్ నుంచి గెలుపొందారు. అసద్ రెండుసార్లు చార్మినార్ నుంచి అసెంబ్లీకి, తదుపరి 2004 నుంచి నాలుగుసార్లు హైదరాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి 1999 నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచారు. 1999లో తండ్రి లోక్ సభకు, ఇద్దరు కుమారులు అసెంబ్లీకి ఎన్నికవడం ఒక ప్రత్యేకత. సలావుద్దీన్, అసద్ కలిసి ఇంతవరకు పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారన్నమాట. తండ్రి, ఇద్దరు కుమారులు కలిసి పన్నెండుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment