ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని దాస్నాదేవి ఆలయ ప్రధాన పూజారి(మహంత్) యతి నరసింహానంద్ సరస్వతి సీఎం యోగి ఆదిత్యానంద్‌ను కలుసుకునేందుకు బయలుదేరారు. ఈ నేపధ్యంలో అతనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని నిందించడమే కాకుండా సీఎంను ఉద్దేశిస్తూ, ఆధికారం ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే యతి నరసింహానంద్ గత 27న మీరఠ్‌లోని ఖజురీ గ్రామానికి వెళ్లాలని అనుకున్నారు. అక్కడ ఏడాది క్రితం దీపక్ త్యాగి హత్య జరిగింది. ఈ సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఆ గ్రామానికి వెళ్లాలని భావించారు. అయితే స్థానిక పోలీసులు ఆయనను అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఈ నేపధ్యంలో యతి నరసింహానంద్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్‌కు తన రక్తంతో ఒక ఉత్తరం రాశారు. ఘజియాబాద్ నుంచి లక్నో వరకూ పాదయాత్రగా వెళ్లి, ఆ ఉత్తరాన్ని యోగి ఆదిత్యానంద్‌కు ఇవ్వాలనుకున్నారు. అయితే పోలీసులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ములాయం, మాయావతి, అఖిలేష్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తనను పోలీసులు ఎప్పుడూ అడ్డుకోలేదని, ఇప్పుడు యోగి ముఖ్యమంత్రి అయ్యాక పోలీసులు తనను అడ్డుకున్నారని ఆరోపించారు. యూపీ ముఖ్యమంత్రి రావణాసుసురుడికంటే తక్కువవాడేమీ కాదని పేర్కొన్నారు. సీఎం పోలీసుల మాటనే వింటున్నారని, తన మాట వినడం లేదని యతి నరసింహానంద్ ఆరోపించారు.
కొద్దిసేపు యతి నరసింహానంద్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగిన అనంతరం పాదయాత్రకు పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో అతని శిష్యులు 10 రోజుల పాటు పాదయాత్ర చేసి, ఆ లెటర్‌ను అక్టోబరు 8న సీఎంకు అందివ్వనున్నారని సమాచారం.
ఇది కూడా చదవండి: పాక్ జెండా ఎగురవేసిన తండ్రీకుమారులు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment