mahanth
-
యూపీ సీఎంపై మహంత్ తీవ్ర వ్యాఖ్యలు.. పోలీసులతో వాగ్వాదం
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని దాస్నాదేవి ఆలయ ప్రధాన పూజారి(మహంత్) యతి నరసింహానంద్ సరస్వతి సీఎం యోగి ఆదిత్యానంద్‌ను కలుసుకునేందుకు బయలుదేరారు. ఈ నేపధ్యంలో అతనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని నిందించడమే కాకుండా సీఎంను ఉద్దేశిస్తూ, ఆధికారం ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే యతి నరసింహానంద్ గత 27న మీరఠ్‌లోని ఖజురీ గ్రామానికి వెళ్లాలని అనుకున్నారు. అక్కడ ఏడాది క్రితం దీపక్ త్యాగి హత్య జరిగింది. ఈ సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఆ గ్రామానికి వెళ్లాలని భావించారు. అయితే స్థానిక పోలీసులు ఆయనను అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో యతి నరసింహానంద్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్‌కు తన రక్తంతో ఒక ఉత్తరం రాశారు. ఘజియాబాద్ నుంచి లక్నో వరకూ పాదయాత్రగా వెళ్లి, ఆ ఉత్తరాన్ని యోగి ఆదిత్యానంద్‌కు ఇవ్వాలనుకున్నారు. అయితే పోలీసులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ములాయం, మాయావతి, అఖిలేష్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తనను పోలీసులు ఎప్పుడూ అడ్డుకోలేదని, ఇప్పుడు యోగి ముఖ్యమంత్రి అయ్యాక పోలీసులు తనను అడ్డుకున్నారని ఆరోపించారు. యూపీ ముఖ్యమంత్రి రావణాసుసురుడికంటే తక్కువవాడేమీ కాదని పేర్కొన్నారు. సీఎం పోలీసుల మాటనే వింటున్నారని, తన మాట వినడం లేదని యతి నరసింహానంద్ ఆరోపించారు. కొద్దిసేపు యతి నరసింహానంద్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగిన అనంతరం పాదయాత్రకు పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో అతని శిష్యులు 10 రోజుల పాటు పాదయాత్ర చేసి, ఆ లెటర్‌ను అక్టోబరు 8న సీఎంకు అందివ్వనున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: పాక్ జెండా ఎగురవేసిన తండ్రీకుమారులు అరెస్ట్ -
మైనర్‌కు మద్యం తాగించి అఘాయిత్యం... ఆధ్యాత్మిక ‘గురువు’ అరెస్ట్
భోపాల్: నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. ఇంటా బయటా అన్ని చోట్ల వేధింపులు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా, నిందితులను కఠినంగా శిక్షించినా.. కామాంధుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. మహిళలపై లైంగికదాడులు ఆగడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ఓ ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతున్న వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ఠ్ చేశారు. రేవా జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక గురువు మహంతి సీతారాం దాస్ అలియాస్ సీతారాం త్రిపాఠి ఓ బాలికను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మార్చి 28న చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే రౌడీ షీటర్ సాయంతో.. అధిక భద్రత కలిగి ఉన్న సర్క్యూట్ హౌజ్ (ప్రభుత్వ భవనం)లో ఈ ఘోరానికి ఒడిగట్టడం గమనార్హం. అనంతరం బాధితురాలిని మహంత్ అనుచరులు కారులో మరో చోటుకి తీసుకెళ్లి వదిలేశారు. అయితే స్థానికుల సహాయంతో ఆమె అక్కడి క్షేమంగా బయటపడింది. చదవండి: సాఫ్ట్వేర్ కంపెనీల్లో మంచి హోదా.. ఉద్యోగాలు పెట్టిస్తానంటూ.. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు రేవా జిల్లా పోలీసులకు మార్చి 29న ఫిర్యాదు చేయగా.. సీతారాం త్రిపాఠి, రౌడీ షీటర్తోపాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవా పోలీసులను ఆదేశించిన కొన్ని గంటల్లోనే సీతారాం త్రిపాఠిని పోలీసులు సింగ్రౌలీ జిల్లాలో గురువారం అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఏసీపీ శివ కుమార్ వర్మ తెలిపారు. అయితే ప్రజాప్రతినిధులతో సహా వీఐపీలు బస చేసేందుకు ఉద్దేశించిన సర్క్యూట్ హౌస్‌లో రౌడీ షీటర్ పేరున గదిని ఎలా కేటాయించారనే దానిపై విచారణ జరుగుతోందని ఏసీపీ తెలిపారు. -
తీవ్ర మానసిక క్షోభతోనే మహంత్ గిరి ఆత్మహత్య
న్యూఢిల్లీ: అఖిల భారతీయ అఖాడా పరిషత్ దివంగత అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్యకు అతని మాజీ శిష్యుల బెదిరింపులు, వేధింపులే కారణమని సీబీఐ పేర్కొంది. మాజీ శిష్యులైన ఆనంద్ గిరి, ఆధ్యప్రసాద్ తివారీ, అతని కొడుకు సందీప్ తివారీల చేతిలో అవమానాలను భరించలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని సీబీఐ తన చార్జిషీటులో తెలిపింది. ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నప్పటికీ వీడియోను బహిర్గతం చేస్తానంటూ ఆనంద్ గిరి తనను బెదిరించినట్లు ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు మహంత్ నరేంద్ర గిరి ఆరోపిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో తమకు లభ్యమైందని సీబీఐ తెలిపింది. అలహాబాద్‌లోని బడే హనుమాన్ మందిర్ పూజారి ఆనంద్ గిరి, ఆధ్యప్రసాద్ తివారీ, సందీప్ తివారీలు మహంత్ బలన్మరణం కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించడం, నేరపూరిత కుట్రలో నిందితులుగా పేర్కొంటూ ఈ నెల 20వ తేదీన కోర్టుకు సీబీఐ చార్జిషీటు సమర్పించిందని అధికారులు వెల్లడించారు. అలహాబాద్‌లోని బాఘంబరీ మఠంలోని తన గదిలో సెప్టెంబర్ 20వ తేదీన మహంత్ గిరి ఉరికి వేలాడుతుండగా గమనించి శిష్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
'రమ్యకృష్ణ అంత పిరికిది కాదు'
హైదరాబాద్ : చనిపోయిందన్న గంట ముందే తన కుమార్తె ఫోన్లో మాట్లాడిందని ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రమ్యకృష్ణ తల్లి ఉషారాణి తెలిపారు. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన రమ్యకృష్ణ అనే యువతి వారం క్రితం ఆస్ట్రేలియాలో వారం క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకు వచ్చారు. కాగా రమ్యకృష్ణకు నాలుగేళ్ల క్రితం మెల్బోర్న్కు చెందిన మహంత్‌తో వివాహం జరిగింది. కుమార్తె మృతిపై రమ్యకృష్ణ తల్లి మాట్లాడుతూ 'నాతో మాట్లాడిన తర్వాత మళ్లీ కాల్ వచ్చింది. (చదవండి..ఆస్ట్రేలియాలో ఎన్నారై యువతి అనుమానస్పద మృతి) ఆ రెండు గంటల్లో ఏమి జరిగిందో ఏమో చనిపోయిందని ఫోన్ వచ్చింది. అది కూడా మహంత్ చెప్పలేదు. అతడి కంపెనీలో చేసే అబ్బాయి సమాచారం ఇచ్చాడు. మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. చాలా ధైర్యవంతురాలు, కష్టాలకు అధైర్యపడదు. కొద్దిరోజుల క్రితం కారు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కూడా చాలా ధైర్యంగా ఉంది. నా కూతురిది ఆత్మహత్య కాదు, హత్యే. అందుకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలి. నా కూతురును అత్తమామలు సూటిపోటీ మాటలతో వేధించేవారు. ఎన్నోసార్లు నాతో చెప్పుకుని బాధపడింది. పరోక్షంగా కారకులైన అత్తమామలపై కూడా చర్యలు తీసుకోవాలి.' అని డిమాండ్ చేశారు. తమ కుమార్తె మృతదేహం ఇచ్చేంతవరకూ మమ్మల్ని మహంత్ తన చెప్పుచేతల్లో ఉంచుకున్నాడని రమ్యకృష్ణ తండ్రి పూర్ణచంద్రరావు అన్నారు. నా కూతురు ఉరేసుకున్నందన్న దానికి ఆధారం లేదు. మహంత్ పొంతన లేని సమాధానం చెబుతున్నాడని ఆస్ట్రేలియా పోలీసులే అన్నారని ఆయన తెలిపారు. మహంత్‌తో పాటు అతడి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని మహంత్ తండ్రి సుబ్రహ్మణ్యం అన్నారు. తాను 15 రోజులపాటు ఆస్ట్రేలియాలోనే ఉన్నానని, భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపించారు. కాగా రమ్యకృష్ణ మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం మహంత్ తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.