![Dk Shivakumar Meets kharge Rahul Over Telangana Cm Candidate - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/5/Dk-Shivakumar-Meets-kharge-Rahul.jpg.webp?itok=ncREYa2s)
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం ఎంపికపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసలంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్, పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ ఠాక్రే ఏఐసీసీ చీఫ్ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పాటు ఉత్తమ్, భట్టిలతో జరిగిన సమావేశ వివరాలపై డీకే ఏఐసీసీ చీఫ్‌కు నివేదిక అందించారు. సీఎం ఎంపికపై ఖర్గే నివాసానికి వెళ్లే ముందు డీకేఎస్ మీడయాతో మాట్లాడారు.
‘తెలంగాణ సీఎల్పీ నేతను హై కమాండ్ నిర్ణయిస్తుంది. ఫైనల్‌గా హై కమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుంది’ అని డీకే శివకుమార్ చెప్పారు. అంతకముందు హైదరాబాద్ నుంచి ఇవాళే ఢిల్లీకి వచ్చిన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో డీకే శివకుమార్, ఠాక్రేలు విడివిడిగా భేటీ అయ్యారు. సీఎం ఎంపికపై వారిరువురి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు.
కాగా, ఉదయం ఇండియా కూటమి సమావేశానికి వెళ్లేముందు ఏఐసీసీ చీఫ్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఎప్పటిలోగా సీఎం ఎంపిక ఉంటుందనేదానిపై క్లారిటీ ఇచ్చారు. సాయంత్రంలోగా సీఎం పేరును ప్రకటిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment