సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేయడంలో ఉమ్మ డి కరీంనగర్ జిల్లా కీలకపాత్ర పోషిస్తుందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. 2001లో పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి తిరుగులేని ఆధిక్యంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని, ఈసారి కూడా అది పునరావృతం అవుతుందని చెప్పారు. సోమవారం మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రగతిభవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్‌తో కేసీఆర్‌కు, తెలంగాణ ఉద్యమానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. 2001 నుంచి నేటి వరకూ జిల్లా ప్రజలతో మమేకమై, తీసుకున్న ప్రతీ కార్యక్రమం విజయవంతం చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ పటిష్టంగా పనిచేస్తుందన్నారు. తాజా సర్వేల్లోనూ, అన్ని నివేదికల్లోనూ ఈసారి ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఎదురులేదని స్పష్టమైందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ ల డిపాజిట్లు కొల్లగొట్టే విధంగా రాబోయే మూడునెలలు పూర్తిస్థాయిలో ప్రజాప్రతినిధులు మొదలు కార్యకర్త వరకూ ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాలు నిర్వహించేలా యాక్షన్‌ప్లాన్ రూపకల్పన చేయాలని ఆదేశించారు.
చదవండి: కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడంలో ఉమ్మడి కరీంనగరే కీలకం..
బీఆర్‌ఎస్ కంచుకోటగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రౌండ్‌క్లియర్ ఉందని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి జైత్రయాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పారు. కనీస పోటీనిచ్చే పరిస్థితిలో ప్రతిపక్షాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రసమయి, రమేశ్‌బాబు, సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్‌రెడ్డి, సంజయ్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, ఎల్.రమణ, పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment