
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. సీఎంగా తన పేరు ప్రకటనకు కొద్ది నిముషాల ముందే రేవంత్ చేసిన ట్వీట్ సంచలనం రేపింది.
‘‘తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
— Revanth Reddy (@revanth_anumula) December 5, 2023
వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి.
అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి.
కాగా, తెలంగాణ రాజ్‌భవన్ వద్ద నిన్నంతా హైడ్రామా నడిచింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే.. నిన్న ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ, ఇవాళ ఢిల్లీ పరిణామాల తర్వాత మంగళవారం సాయంత్రం జరిగిన సీఎల్పీ భేటీ అయ్యాక ఈ నిర్ణయం వెల్లడించింది. పలువురు సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం, చివరకు రేవంత్ పేరునే ఖరారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment