హిమాచల్‌ సీఎం సుఖూకు అస్వస్థత | Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu Health Is Not Well | Sakshi
Sakshi News home page

హిమాచల్‌ సీఎం సుఖూకు అస్వస్థత

Published Sat, Sep 21 2024 1:37 PM | Last Updated on Sat, Sep 21 2024 1:49 PM

Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu Health Is Not Well

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకున్నారు. ఆయనను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపధ్యంలో సీఎం జమ్మూ ఎన్నికల పర్యటన వాయిదా పడింది.

మీడియాకు అందిన వివరాల ప్రకారం సీఎం సుఖూ శనివారం ఉదయం ఐజీఎంసీలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయడంతో పాటు వైద్యులు అతని రక్త నమూనాలు కూడా తీసుకున్నారు. సీఎం ఆరోగ్యంపై ఐజీఎంసీ ఎంఎస్ డాక్టర్ రాహుల్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు.

సీఎం సుఖూ తనకు కడుపు పైభాగంలో నొప్పి వస్తోందని తెలిపారని, ఈ నేపధ్యంలోనే అతనికి అల్ట్రాసౌండ్ చేయించామన్నారు. దీని రిపోర్టు నార్మల్ గా ఉందని, అయితే ముందుజాగ్రత్తగా రక్తపరీక్ష కూడా చేశామన్నారు. ఈ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందన్నారు. కాగా గత ఏడాది  సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ కడుపునొప్పితో బాధపడుతూ వారం రోజుల పాటు ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: తెరుచుకున్న జార్ఖండ్‌- బెంగాల్‌ సరిహద్దు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement