ఈ సినిమాలో నాకు ఛాన్స్‌ రాలేదని బాధగా ఉంది.. సుమన్‌ | Suman Review On Rangaswamy Movie | Sakshi
Sakshi News home page

పల్సర్‌ బైక్‌ ఝాన్సీ ముఖ్య పాత్రలో రంగస్వామి, సినిమా బాగుందన్న సుమన్‌

Published Thu, Mar 30 2023 7:45 PM | Last Updated on Thu, Mar 30 2023 7:45 PM

Suman Review On Rangaswamy Movie - Sakshi

ఈ సినిమా నచ్చి తదుపరి చిత్రంలో తప్పకుండా అవకాశం ఇవ్వాలని సుమన్ మమ్మల్ని కోరడం

నరసింహాచారి, డా.సకారం మారుతి, భాస్కర్‌రెడ్డి, చిత్రం శ్రీను, మీనాక్షిరెడ్డి, పల్సర్‌ బైక్‌ ఝాన్సీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రంగస్వామి’. డ్రీమ్‌ సినిమా పతాకంపై స్వీయ దర్శకనిర్మాణంలో నరసింహాచారి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని సీనియర్‌ నటుడు సుమన్‌ వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘యువత డ్రగ్స్‌ ఉపయోగించినప్పుడు ఎంత ఆనందిస్తున్నారో.. ఆ తర్వాత అంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఆ విషయాన్ని ఇందులో చక్కగా చూపించారు. యువతకు మంచి సందేశాన్నిస్తుంది. ట్రైలర్‌ చూశాక ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదనిపించింది. ఎమోషన్స్‌ పండించడం చాలా కష్టం. ఈ చిత్రంలో దానికే ఎక్కువ మార్కులు పడతాయి. ఇలాంటి చిత్రంలో నాకు పాత్ర రాలేదని కాస్త బాధగా ఉంది. సినిమా చూశాక మెండ్‌ ఫ్రెష్‌ అయినట్లు అనిపించింది. ఇలాంటి కథలు రావడం ఈ సమాజానికి అవసరం’’ అని అన్నారు.

నటుడు సకారం మారుతి మాట్లాడుతూ ‘‘దర్శకుడు చెప్పినట్లు చేశాం. మట్టిని పిండి బొమ్మగా మలచినట్లు మా నుంచి చక్కని నటన రాబట్టారు. ఆ క్రెడిట్‌ అంతా దర్శకుడిదే. సినిమాలపై ఎంతో అవగాహన, అనుభవం ఉన్న సుమన్‌గారు సినిమా చూసి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో మా సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. పైగా ఈ సినిమా నచ్చి మా టీం చేసే తదుపరి చిత్రంలో తప్పకుండా అవకాశం ఇవ్వాలని సుమన్ మమ్మల్ని కోరడం చాలా ఆనందంగా అనిపించింది’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement