తాళాలు బద్దలుకొట్టి భారీగా సొత్తు చోరీ | Robbery in anantapur district | Sakshi
Sakshi News home page

తాళాలు బద్దలుకొట్టి భారీగా సొత్తు చోరీ

Published Sun, May 1 2016 9:52 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Robbery in anantapur district

గుత్తి : అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దొంగలు అదను చూసుకుని ఓ ఇంట్లో భారీగా సొత్తును చోరీ చేశారు. జెండా వీధిలో ధనుంజయ్ అనే వ్యక్తి, తన భార్యతో కలసి ఇంటికి తాళం వేసి శనివారం రాత్రి డాబాపై నిద్రించారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు అర్ధరాత్రి ఇంటి తాళం పగులగొట్టుకుని లోపలికి ప్రవేశించారు.

25 తులాల బంగారు ఆభరణాలు, రూ.20వేల నగదు ఎత్తుకుపోయారు.ఆదివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement