స్కూల్లో టీచర్ మందలించడంతో మనస్తాపం చెందిన ఓ పదో తరగతి విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు.
స్కూల్లో టీచర్ మందలించడంతో మనస్తాపం చెందిన ఓ పదో తరగతి విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గుత్తి పట్టణానికి చెందిన దినేష్ రెడ్డి సోమవారం ట్యూషన్ కు వెళుతున్నానని చెప్పి.. బయటికి వెళ్లాడు. రాత్రి పొద్దుపోయేవరకూ ఇంటికి తిరిగి రాకపోయేసరికి తల్లిదండ్రులు అతడి కోసం గాలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కర్నూలు రోడ్డు రైల్వే గేటు సమీపంలో పట్టాలపై దినేష్ రెడ్డి మృత దేహాన్ని గుర్తించారు. ఇటీవలే స్కూల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో సరిగా రాయలేదని.. దీంతో ఫిజిక్స్ టీచర్, కరస్పాండెంట్ దినేష్ ను మందలించారని తెలిసింది. అంతే కాకుండా.. తల్లిదండ్రులకు చెబుతామని అనటంతో భయపడిన దినేష్ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం.