the student
-
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
స్కూల్లో టీచర్ మందలించడంతో మనస్తాపం చెందిన ఓ పదో తరగతి విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గుత్తి పట్టణానికి చెందిన దినేష్ రెడ్డి సోమవారం ట్యూషన్ కు వెళుతున్నానని చెప్పి.. బయటికి వెళ్లాడు. రాత్రి పొద్దుపోయేవరకూ ఇంటికి తిరిగి రాకపోయేసరికి తల్లిదండ్రులు అతడి కోసం గాలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కర్నూలు రోడ్డు రైల్వే గేటు సమీపంలో పట్టాలపై దినేష్ రెడ్డి మృత దేహాన్ని గుర్తించారు. ఇటీవలే స్కూల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో సరిగా రాయలేదని.. దీంతో ఫిజిక్స్ టీచర్, కరస్పాండెంట్ దినేష్ ను మందలించారని తెలిసింది. అంతే కాకుండా.. తల్లిదండ్రులకు చెబుతామని అనటంతో భయపడిన దినేష్ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. -
పుట్టెడు దుఃఖంలోనూ..
రామసముద్రం: తండ్రి మరణవార్త తెలిసినా దుఃఖాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్ష రాశాడు ఓ విద్యార్థి. ఈ ఘ టన రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీ బూ సానికురప్పల్లె గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బూసానికురప్పల్లె గ్రామానికి చెందిన శ్రీరాములు(40) కుమారుడు వినోద్ పదో తరగతి చదువుతున్నాడు. గురువారం రామసముద్రం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ట్రాక్టర్ పరికరాల కోసం పుంగనూరుకు వెళ్లి తిరిగి వస్తూ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని సమాచారం వచ్చింది. తోటి విద్యార్థులు, పరీక్ష కేంద్రం అధికారులు అతనికి ధైర్యం చెప్పారు. పరీక్ష వదులుకుని వెళ్లిపోతే ఒక ఏడాది వృథా అవుతుందని వారు ఇచ్చిన సలహా మేరకు దుఃఖాన్ని దిగమించుకుని పరీక్ష రాశాడు. పరీక్ష పూర్తికాగానే పరుగున వెళ్లి తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించడం పలువురిని కలచివేసింది. అనుమానాస్పదస్థితిలో తండ్రి మృతి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రామసముద్రం మండలంలో గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుడి సోదరుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు.. బూసానికురప్పల్లె గ్రామానికి చెందిన శ్రీరాములు(40) బుధవారం రాత్రి ట్రాక్టర్ పరికరాల కోసం పుంగనూరుకు బైక్‌పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వనగానిపల్లె సమీపంలోని కనకరత్న డాబా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డు పక్కనున్న చెట్లపొదల్లో పడి చనిపోయాడు. గురువారం ఉదయం అటుగా వెళుతున్న కూలీలు గమనించి స్థానికులకు, పోలీసులకు, మృతుని బంధువులకు సమాచారం అందించారు. రామసముద్రం ఎస్ఐ గౌస్‌బాషా ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరాములు మృతదేహం చెట్లలోకి దూసుకుపోయి ఉండడం, ద్విచక్ర వాహనానికి ఎలాంటి నష్టమూ జరగకపోవడం చూసి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైగా మృతుడి ఎడమ కాలు విరిగిపోయి, వెన్నెముక, మెడ, తల, చేతులపై తీవ్ర గాయాలు కావడంపైనా పలు అనుమానాలు ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. దర్యాప్తులో నిజాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. -
మీతోనే నవ సమాజం
జస్టిస్ చంద్రకుమార్ అనంతపురం లీగల్: ‘మీలోనే శక్తి ఉంది.. మీతోనే నవసమాజం ఏర్పడుతుంది.. బాగా చదివి మంచి ఆలోచనలతో మంచి సమాజాన్ని నిర్మించటం మీవల్లే సాధ్యం’ అంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు జస్టిస్ చంద్రకుమార్. స్థానిక కేఎస్ఆర్ ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విద్యార్థులే ఆశాకిరణాలుగా..భావిభారత నిర్మాణంలో వారిదే కీలక పాత్రగా పేర్కొంటూ వారి ఆలోచనలను పదునుపెట్టటానికి ఆలోచనే ఆయుధంగా మలుస్తున్నానన్నారు. ఎక్కడినుంచి వచ్చాను..ఎక్కడికి వెళుతున్నాను.. అనే చిన్ని ఆలోచనతో మొదలైన తన సత్యాన్వేషణ ఈ కార్యక్రమాలకు ప్రేరణ అన్నారు. పలు విషయాలను ఆయన సూటిగాను సోదాహరణంగా వివరించారు. మనసులోని భయంవల్లే అన్ని అనర్థాలన్నారు. దానిని పారదోలితే అంతా ధైర్యమేనన్నారు. పరీక్షల్లో మార్కులు, ర్యాంకుల కోసం చదివే చదువులు జీవితానికి ఉపయోగపడవన్నారు. పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకుంటేనే ఉపయోగకరమన్నారు. మౌర్య వంశ స్థాపన ఒక స్త్రీ వల్లే సాధ్యపడిందని, అలాంటి చారిత్రక అంశాలు, కథలు జీవితాలను మరింత తేజోవంతం చేస్తాయన్నారు. మంచి పనులు మనిషికి శక్తినిస్తాయని, ఆ శక్తితో గొప్పవాళ్లు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్వార్థ భారతి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ (హైదరాబాదు)మోహన్‌రావు చిన్ని చిన్ని ప్రశ్నలతోనే తన సందేశాత్మక ఝరిని ఆవిష్కరించారు. ప్రతిప్రశ్నకు విద్యార్థులే ముక్తకంఠంతో చెప్పే సమాధానం ఆయన ప్రసంగసారాంశమైంది. ప్రజాగాయకుడు లెనిన్ జస్టిస్ రచించిన కవితను గానం చేశారు. చల్లని వెలుగులనిచ్చే చందమామదే కులం?..చీకట్లను తరిమివేసే సూర్యునిదేకులం?...అంటూ కులం కుళ్లు కడిగేద్దాం నవయుగాన్ని నిర్మిద్దామంటూ ఆ కవితలో చంద్రకుమార్ విద్యార్థులకు పిలుపునందించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కుల రిజర్వేషన్లు ఎందుకు?, అనుభవం గొప్పదా? జ్ఞానం గొప్పదా?, కోర్టు శిక్షలు, రాజకీయాల్లో అక్రమ ధనార్జన తదితర అంశాలపై విద్యార్థునులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థునులను ఆయన అభినందించారు. వారికి బహుమతులుగా పుస్తకాలను బహూకరించారు. తాను రచించిన రెండు పుస్తకాలను కళాశాల గ్రంథాలయానికి అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖరరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్మిక న్యాయస్థానం న్యాయమూర్తి సుమలత, నగర మేయర్ మదమంచి స్వరూప, ఆచార్య కొలకలూరి ఇనాక్ పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన మైనర్ డ్రైవింగ్
రోడ్డు ప్రమాదంలో టెన్త విద్యార్థి దుర్మరణం మరో ఇద్దరికి గాయాలు పరీక్ష రాసి బైక్‌పై వస్తుండగా ఘటన మృతుని తండ్రి కన్నీరమున్నీరు కొయ్యూరు, న్యూస్‌లైన్: మైనర్ డ్రైవింగ్ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. స్థానిక బియ్యం మిల్లు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పరీక్ష రాసి బైక్‌పై వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆశ్రమ పాఠశాలకు చెందిన భూత రాజ్‌కుమార్ (15) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి గణితం పేపర్-2 పరీక్ష రాశాడు. పరీక్ష పూర్తి కాగానే గదబపాలేనికి చెందిన స్నేహితుడు ఎస్.నూకరాజు బైక్‌పై గురుకుల పాఠశాలకు వెళ్లారు. అక్కడ పరీక్ష రాసిన మరో విద్యార్థి మాదల రాజ్‌కుమార్‌ను బైక్‌పై ఎక్కించుకుని ముగ్గురూ బయల్దేరారు. కొయ్యూరు బియ్యం మిల్లు వద్ద వ్యాన్‌ను ఓవర్ టేక్ చేయబోయి పడిపోయారు. బి.రాజ్‌కుమార్‌పై నుంచి వ్యాన్ వెళ్లిపోయింది. వెంటనే అతన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పంపించారు. నర్సీపట్నం చేరువలో రాజ్‌కుమార్ మృతి చెందాడు. గాయపడిన ఎం.రాజ్‌కుమార్, నూకరాజును అంబులెన్స్‌లో నర్సీపట్నం తరలించారు. ప్రయోజకుడు అవుతాడనుకున్నా.. ప్రమాదంలో మృతి చెందిన భూత రాజ్కుమార్దిడౌనూరు వద్ద సుద్దలపాలెం. తల్లి లేకపోవడం, ఒక్కడే కుమారుడు కావడంతో తండ్రి పోతురాజు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. కుమారుని మరణ వార్త విన్న అతను కన్నీరుమున్నీరయ్యాడు. ప్రయోజకుడవుతాడని భావించానని, ఇలా కడుపుకోత మిగులుస్తాడని అనుకోలేదని విలపించడం చూపరులను కలచివేసింది. కొయ్యూరు ఎస్ఐ రాము కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. విద్యార్థి మృతితో సీఎహెచ్ పాఠశాలలో విషాదచాయలు అలముకున్నాయి. పాఠశాల హెచ్ఎం దేవేశ్వరరావు, వార్డెన్ రాజబాబు సంతాపం తెలిపారు.