ముంబై: తన ముగ్గురు బిడ్డలను బావిలోకి తోసేసిన ఓ మహిళ.. ఆ తర్వాత తాను కూడా దూకేసింది. ఈ మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలోని బెస్తవాంగీ గ్రామంలో నివాసం ఉంటున్న ప్రియాంక బాలాజీ వాంఖడే (28) అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో కలత చెంది ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. గ్రామశివారులో గల బావిలోకి తన బిడ్డలు ప్రతీక్ (3), కపిల్ (5), సాక్షి (7) లను ప్రియాంక తోసేసి ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు సోనేఖడ్ పోలీసులు వివరించారు.
లక్ష రూపాయలను అదనపు కట్నంగా తేవాలంటూ అత్తింటివాళ్లు ఒత్తిడి చేస్తుండటమే ఆమె మృతికి కారణమని తెలిపారు. ప్రియాంక భర్త బాలాజీ, మామయ్య గణపతి, అత్తయ్య లీలావతులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కేసును విచారించిన కోర్టు నిందితులను 5 రోజుల రిమాండ్ కు అప్పగించినట్లు తెలిపారు.
ముగ్గురు బిడ్డలతో బావిలోకి దూకింది!
Published Wed, May 25 2016 4:26 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
Advertisement
Advertisement