
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ చెప్పి తిరిగి 10గ్రా. ధర 32వేల స్థాయికి చేరుకుంది. ముఖ‍్యంగా ఇటలీ సంక్షోభం నేపథ్యలో ఇన్వెస్టర్లు పెట్టుబడులు విలువైన లోహం పుత్తడి వైపు మళ్లాయి. జ్యుయలర్స్ కొనుగోళ్లు, అంతర్జాతీయధరల్లో సానుకూలత దేశీయంగా కలిసి వచ్చిందని ట్రేడర్లు చెప్పారు. ఇటలీలోని రాజకీయ సంక్షోభంతో జ్యువెలర‍్ల కొనుగోళ్లు ప్రపంచ మార్కెట్లలో తేలికపాటి లాభాలు దేశీయంగా పసిడి లాభపడుతోందని వాణిజ్యవేత్తలు పేర్కొన్నారు.
ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ. 230 పుంజుకుని పది గ్రా. రూ. 32,090వద్ద, 99.5 శాతం స్వచ్ఛత గల పసిడి రూ.31,940గా ఉంది. . బంగారం ధరలు రూ. గత మూడు సెషన్లలో రూ. 615 క్షీణించింది. కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ. 40,700 స్థాయికి చేరింది. వీక్లీ ఆధారిత డెలివరీ రూ. 335 పుంజుకుని రూ. 39,785 వద్ద ఉంది.అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 0.1 శాతం పెరిగి 1,298.86 డాలర్లకు చేరింది. జూన్ డెలివరీ కోస అమెరికా బంగారు ఫ్యూచర్స్ పెద్దగా మార్పులేదు. ఎంసీక్స్ మార్కెట్‌లో మాత్రం 230 రూపాయలు క్షీణించిన బంగారం ప్రది గ్రా. రూ. 30,958 పలుకుతోంది.
ఆరు ప్రధాన కరెన్సీలకు పోలిస్తే డాలర్ ఇండెక్స్ఆరెన్నర గరిష్టం వద్ద ఉంది. దేశీయ కరెన్సీ డాలరు మారకంలో రూపాయి విలువ 40 పైసలు పుంజుకుని 67.47 వద్ద స్థిరపడింది. మంగళవారం 67.86 వద్ద ముగిసింది. మరోవైపు యూరోజోన్లోని మూడో అతిపెద్ద ఆర్ధికవ్యవస్థలో, జూలై నాటికి మళ్లీ ఎన్నికలు రానున్నాయనీ, వాస్తవిక ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చునని పెట్టుబడిదారులు భయపడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment