న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు దుమ్ము రేపుతున్నాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 219 శాతం వృద్ధితో 1.45 కోట్లకు పెరిగాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, సైబర్ మీడియా రీసెర్చ్ మంగళవారం తెలిపింది.
వీటిల్లో 68 శాతం 3జీ ఎనేబుల్ ఫోన్లేనని అంటున్న ఈ సంస్థ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలపై వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు....,
గత ఏడాది మొదటి మూడు నెలల కాలంలో 66 లక్షల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి.
గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు 1.42 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు విక్రయమయ్యాయి.
ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో మొత్తం 5.89 కోట్ల మొబైల్ ఫోన్‌లు అమ్ముడయ్యాయి. వార్షిక ప్రాతిపదికన 9 శాతం వృద్ధి, మూడు నెలల ప్రాతిపదికన చూస్తే 16 శాతం క్షీణత నమోదైంది. కాగా గత ఏడాది ఇదే కాలానికి మొత్తం 7.04 కోట్ల మొబైళ్లు అమ్ముడయ్యాయి.
గత ఏడాది జనవరి-మార్చి కాలానికి 4.75 కోట్లుగా ఉన్న ఫీచర్ ఫోన్ల విక్రయాలు ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి 7 శాతం క్షీణించి 4.44 కోట్లకు తగ్గాయి. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ విక్రయాలు(5.62 కోట్లు)తో పోల్చితే 21 శాతం తగ్గాయి.
వివిధ రకాల పనులను చేసుకోవడానికి మొబైల్స్ ఉపయోగించుకోవడం పెరుగుతుంది.
డేటా సర్వీసులకు భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరుగుతుంది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 43% వాటాతో శామ్‌సంగ్ తొలి స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో మైక్రోమ్యాక్స్(18%), కార్బన్ (5%)లు నిలిచాయి.
మొత్తం ఫోన్‌ల మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకున్నా, శామ్‌సంగ్‌దే (20% మార్కెట్ వాటా)అగ్రస్థానం, ఆ తర్వాతి స్థానాల్లో నోకియా(18%, మైక్రోమ్యాక్స్(11 శాతం)లు నిలిచాయి.
టాప్‌లేపుతున్న స్మార్ట్‌ఫోన్ విక్రయాలు
Published Wed, May 14 2014 12:03 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement