సాక్షి, ముంబై : దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. వరుస నష్టాలనుంచి కోలుకున్న సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ చేసింది. అయితే స్వల్ప ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 179 పాయింట్లు జంప్‌చేసి 37,572 కు చేరగా.. నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకుని 11,302 వద్ద ట్రేడవుతోంది. తద్వారా నిఫ్టీ 11300 ఎగువకు చేరింది.
రియల్టీ, బ్యాంక్స్ సహా మీడియా, రియల్టీ అన్ని రంగాలూ లాభపడుతున్నాయి. మరోవైపు అమెరికాలో రేట్ల కుంభకోణం, ఫలితాల నేపథ్యంలో స్వల్పంగా నష్టపోతోంది. ప్రెస్టేజ్, డీఎల్‌ఎఫ్, బ్రిగేడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఇండియాబుల్స్, శోభా , మీడియా స్టాక్స్‌లో జీ, పీవీఆర్, ఐనాక్స్, టీవీ 18, ఈరోస్, నవనీత్, సన్ టీవీ 4-1.2 శాతం మధ్య పెరిగాయి.
బ్లూచిప్స్ షేర్లలో బజాజ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, హీరో మోటో, కోల్ ఇండియా, ఎంఅండ్‌ఎం, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో 4-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హిందాల్కో, బీపీసీఎల్, ఐవోసీ, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3-0.5 శాతం మధ్య క్షీణించాయి. అరబిందో 5 శాతం, కేడిలా, మదర్‌సన్ తదితరాలునష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment