ఇంతవరకు పక్షులకు సంబంధించిన పలు వీడియోలు చూశాం. కొన్ని పక్షులు మనుషుల వలే మాట్లాడటం వంటివి కూడా విన్నాం. నిపుణుడి పరివేక్షణలోనూ లేదా ఏ సర్కస్లోనూ ఆయా సంరక్షకుల సమక్షంలో విన్యాసాలు చేయడం చూసి ఉంటాం. అంతే గానీ వాటంతట అవి చేయడం జరగదు. కానీ ఈ పావురం తనంతట తాను విచిత్రమైన విన్యాసం చేసింది.
వివరాల్లోకెళ్తే... ఒక తెల్లటి పావురం తనంతట తానుగా ఒక్కసారిగా రెక్కలు విప్పుతూ.. అనుహ్యంగా వెనుకకు జంప్ చేస్తుంది. ఏదో అనుకోకుండా చేసింది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అది అలా మూడుసార్లు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు వావ్ భలే జిమ్నాస్టిక్స్ చేసింది అంటూ ఆ పావురాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
— Hana (@magicthings7) July 28, 2022
(చదవండి: వీడియో: రియల్ బాహుబలి.. ఇలా చేయాలంటే గట్స్ ఉండాలి)
Comments
Please login to add a commentAdd a comment