Bamboo bridge For Groom: ఇటీవల ఉత్తరాన జరిగే వివాహాలు చర్చనీయాంశమవడమే గాక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఓ వరుడు అత్తగారి ఇంటి నుంచి వధువును తన భుజాలపై ఎత్తుకుని వాగు దాటించగా, మరో ఘటనలో వధువును ఆమె కుటుంబ సభ్యులు పడవలో అత్తారింటికి సాగనంపారు. తాజాగా అలాంటి ఘటనే బీహార్‌లో వెలుగుచూసింది. అరారియాలో ఫుల్సర గ్రామంలోని అమ్మాయికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఆ యువతి పెళ్లికి ముందు రోజు గ్రామంలోని కాలువపై వంతెన నిర్మాంచారు అది కూడా రాత్రికి రాత్రే.
అసలు వివాహానికి వంతెనకు లింకేంటి అనుకుంటున్నారా? పుల్సర గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో, గ్రామస్తులు కాలువ గుండా ప్రయాణించే వారు. వివాహాది శుభకార్యాలకు విషయానికొస్తే ఎన్నో వ్యయ ప్రయాసలతో జరిగేవి. కొందరు గ్రామస్తులు తమ కుమార్తెలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి వివాహం జరిపించేవారు. అటువంటి పరిస్థితుల్లో తాజాగా గ్రామానికి చెందిన బతేష్ తన కుమార్తె రాఖీ కుమారి వివాహం కారణంగా ఆ ఇబ్బందులు తీరింది. అమ్మాయి తరపు వాళ్లు పెళ్లి తేది వరకు అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. కాని ఇక్కడ ప్రధాన సమస్యగా .. వరుడిని అతడి బంధుమిత్రులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ గ్రామానికి తీసుకురావడం.
దీంతో వారు ఈ సమస్యకు పరిష్కారం కోసం చర్చించారు. చివరికి వెదురు వంతెన నిర్మించాలని తీర్మానించుకున్నారు. ఇంకేముంది టైం తక్కువ ఉండడంతో అనుకున్నదే తడవుగా రాత్రికి రాత్రే నిర్మాణం మొదలుపెట్టి పూర్తి కూడా చేశారు. వంతెన బలంగా లేనప్పటికీ, ఊరేగింపుగా వరుడిని తీసుకొచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు. దీంతో పెళ్లి కొడుకుని బైక్ మీద ఎక్కించుకుని వంతెనను దాటించి ఇంటికి తీసుకువచ్చారు. వరుడితో పాటు, అతడి బంధుమిత్రులు కూడా వెదురు వంతెన సాయంతో కాలువ దాటి గ్రామానికి చేరుకుని వివాహానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పెళ్లి , వరుడి కోసం వంతెన నిర్మించడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment