
పెళ్లి అనేది కొత్త జీవితానికి నాంది. ప్రతి ఒక్కరూ తమ పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వివాహం జీవితాంతం గుర్తుండిపోయేలా అందమైన జ్ఞాపకంగా మలుచుకోవాలనుకుంటారు. కానీ అన్ని అనుకున్నట్లు జరగవు. కొన్నిసార్లు పెళ్లిలో ఊహించని సంఘటనలు సైతం జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. పెళ్లి మండపం మీద వధూవరులు కూర్చొని ఉండగా వారి చుట్టూ బంధువులు చేరారు. అప్పటి వరకు అంతా ఉత్సాహంగా ఉన్న కార్యక్రమంలో ఒక్కసారిగా వధువు ముఖం కోపంగా పెట్టింది.
చదవండి: మొబైల్ ఫోన్‌ను ఎత్తుకుపోయిన చిలుక.. ఫన్నీవీడియో
దీనికి కారణం తనకు కాబోయే భర్త పొగాకునములుతున్నాడని ఆమెకు తెలిసింది. దీంతో ఏమాత్రం ఆగకుండా ఆగ్రహంతో వరుడి చెంపచెల్లుమనిపించింది. అతనితోపాటు తన ఎదురుగా ఉన్న వ్యక్తిని సైతం కొట్టింది. పెళ్లి కూతురు చర్యతో కంగుతున్ని వరుడు వెంటనే అక్కడి నుంచి లేచి నోటిలోని పొగాకును ఉమ్మేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవ్వడంతో వధువు చర్యను ప్రశంసిస్తున్నారు. పెళ్లి పీటలపై పొగాకు తింటున్న వరుడిపై మండిపడుతున్నారు. అయితే ఇది నిజంగా జరిగిందా లేక కావాలనే చేశారా అన్నది మాత్రం తెలియరాలేదు.
చదవండి: 8 కేజీల వెడ్డింగ్ లెహంగాతో వధువు పుష్ అప్స్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment