
మైసూరు: మరో రెండు రోజుల్లో అతడికి పెళ్లి జరగాల్సి ఉంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇంతలో కరోనా బలి తీసుకుంది. వివరాలు.. మైసూరు హెబ్బాళు నివాసి నవీన్ (31) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. మార్చి 7న ఓ యువతితో నిశి్చతార్థం జరిగింది. మే 19, 20 తేదీల్లో పెళ్లి ముహూర్తం. ఇంతలో నవీన్‌కు దగ్గు రావడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోలేకపోయాడు. దీంతో జిల్లా కోవిడ్ ఆస్పత్రికి తరలించగా సోమవారం మరణించాడు. నవీన్ ఇంట్లో అతని అన్న, వదినకు కరోనా సోకింది. పెళ్లి ఇంట రోదనలు మిన్నంటాయి.
చదవండి: ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా
చదవండి: కరోనాతో టీవీ ఛానల్ ఎండీ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment